చిన్న చిన్న కారణాలు ఒక్కోసారి దారుణమయిన ఘటనలకు కారణం అవుతున్నాయి. భార్యభర్తల మధ్య గొడవలు ఆత్మహత్యలకు, హత్యలకు దారితీస్తాయి. తాజాగా ఓ గర్భవతి ఆత్మహత్య చేసుకుంది. గ్రామం కట్టుబాట్లతో ఆ గర్భవతి మృతదేహాన్ని ఊరిలోకి అనుమతించలేదు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా దేవనకొండ( మం) వరిముక్కలలో అంత్యక్రియల కోసం గర్భవతి మృతదేహం ఎదురుచూస్తోంది. గ్రామ వాలంటీర్ సరోజ(32) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also:President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తప్పని కరెంట్ కోతల తిప్పలు..
సరోజ నాలుగు నెలల గర్భవతి. కర్నూలులో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. భర్త జగన్, అత్తమామలు వేధింపులే కారణమంటున్నారు బంధువులు. ధ్వజస్తంభ ప్రతిష్ట ఉండడంతో గ్రామంలో అంత్యక్రియలు చేయరాదని సంప్రదాయం ఉంది. దీంతో రాత్రి నుంచి గ్రామం బయట గర్భవతి మృతదేహాన్ని అంబులెన్సు లో ఉంచారు బంధువులు. మృతురాలు సరోజకు తల్లిదండ్రులు లేరు. భర్తను పోలీసులు తీసుకువస్తేనే అంత్యక్రియలు చేస్తామని పట్టుబడుతున్నారు బంధువులు. దీంతో అంబులెన్స్ లోనే సరోజ మృతదేహం అంత్యక్రియలు చేయడానికి వీలుపడడం లేదని అంటున్నారు. బంధువులు మాత్రం భర్తపై కేసు నమెదుచేయాలంటున్నారు.
Read Also:Top Headlines @9AM: టాప్ న్యూస్