ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతుంది. సముద్రాల మానస అనే 22 ఏళ్ల బీడీఎస్ విద్యార్థిని హాస్టల్ గదిలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వరంగల్‌కు చెందిన మానస బీడిఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. మానస ఆత్మహత్య అనంతరం పోస్టు మార్టం పూర్తి అయ్యింది. బంధువులు హన్మకొండకు తీసుకుని వెళ్లారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు మాత్రం తెలియడం లేదని బందువులు అంటున్నారు. మాసన మరణంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నాయి. ఇవాళ మానస స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగనున్నాయి.
Also Read : Tirumala: టీటీడీ ఈవో కీలక నిర్ణయం.. ఇక వారికే వీఐపీ బ్రేక్ దర్శనాలు
నిన్న (ఆదివారం) కళాశాల ఆవరణలోని హాస్టల్‌లో నివాసం ఉంటున్న మానస నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. మానస నేలపై కుప్పకూలినట్లు తోటి విద్యార్థులు గుర్తించారు. వెంటనే వారు 108 మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్‌ను సంప్రదించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే మాసన పూర్తిగా కాలిపోయి విగతజీవిగా కనిపించింది. ఈ హృదయ విదారక ఘటనపై వరంగల్‌లోని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆమె మృతిని అనుమానస్పంద మృతిగా ఖమ్మం టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఓ పెట్రోలు బంకు నుంచి మానస పెట్రోలు కొనుక్కుని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మానస తండ్రి ఇటీవలే మరణించారు. ఆ బాధ నుంచి ఆమె కోలుకోలేకపోయిందని, తరచూ తండ్రిని తలచుకుని బాధపడేదని తెలుస్తోంది. మానసది ఆత్మహత్యేనని భావిస్తున్నామని, ఆమె గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు.
Also Read : Rajamouli: అది సార్ మా జక్కన్న బ్రాండు…