ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది.. కాకతీయ మెడికల్ కాలేజీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు మెడికల్ సిబ్బంది కరోనా బారిన పడగా.. తాజాగా మరో 15 మంది మెడికోలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో, కాకతీయ మెడికల్ కాలేజీలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య 44కు చేరుకుంది. కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లతో సహా 29 మంది మెడికోలకు నిన్న మధ్యాహ్నం వరకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, తాజాగా మరో 15 మందికి పాజిటివ్‌గా తేలడంతో కలకలం మొదలైంది.
Read Also: మేడారం భక్తులకి శుభవార్త
మరోవైపు, స్వల్ప లక్షణాలున్న మెడికోలను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.. మెడికల్ కాలేజీలో వరుసగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మెడికోలు, తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.. ఎంజీఎంలో వైద్యసేవలు అందిస్తున్న క్రమంలోనే వారంతా కోవిడ్ బారిన పడ్డారని వైద్య విద్యార్థులు, భావిస్తున్నారు. వరంగల్ ఎంజీఎంలో వైద్య సేవలను అందించే క్రమంలోనే.. మెడికోలు కరోనా బారిన పడుతున్నారని చెబుతున్నారు.