సూర్యాపేట వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటనలో…ఆరుగురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వసతి గృహం నుంచి శాశ్వతంగా పంపించేశారు. సూర్యాపేట ర్యాగింగ్ ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసి ఇబ్బందులకు గురిచేసిన ఆరుగురు సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేస్తూ డీఎంఈ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 2019-20 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు జె.మహేందర్, జి.శశాంక్, పి.శ్రవణ్, ఏ.రంజిత్ సాయి, కె.హరీష్, బి.సుజిత్‌పై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. అలాగే వారిని హాస్టల్ నుంచి శాశ్వతంగా రద్దు చేస్తూ డీఎంఈ రమేష్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
Read Also:ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి: కేటీఆర్
శనివారం రాత్రి ఓ జూనియర్ విద్యార్థిని సీనియర్ విద్యార్థులు నాలుగు గంటల పాటు వేధించారు. హైదరాబాద్‌లోని మైలార్‌దేవులపల్లి ప్రాంతానికి చెందిన సాయికుమార్…సూర్యాపేట మెడికల్ కాలేజ్‌లో చదువుతూ కళాశాలకు చెందిన హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈనెల 1న కొందరు సీనియర్ విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటూ మద్యం సేవించారు. సాయికుమార్‌ను తమ గదికి రావాలని పిలిచారు. బయోడేటా చెప్పాలని, దుస్తులు విప్పించి ఇబ్బందులకు గురిచేస్తూ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి…చిత్రహింసలకు గురి చేశారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఎంఈ రమేశ్‌రెడ్డిని ఆదేశించారు మంత్రి హరీశ్‌రావు. ప్రాథమిక విచారణ అనంతరం ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై కేసులు నమోదు చేసింది.