మహిళల పట్ల అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు చేసినా, శిక్షలు విధిస్తున్నా మృగాళ్లు మారడం లేదు. అభం శుభం తెలియని చిన్న పిల్లలను సైతం తమ కామవాంఛకు బలిచేస్తున్నారు. వారి ప్రాణాలు సైతం తీస్తున్న సందర్భాలు అనేకం. తెలిసి తెలియని వయసులో చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపగానే వారితో వెళ్తూ ఉంటారు పసివాళ్లు. దానిని ఆసరాగా తీసుకొని వారిపై ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే గుడ్ టచ్, బ్యాడ్…
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సందర్శించిన ఓ కాలేజీని అక్కడి విద్యార్థులు గోమూత్రంతో శుద్ధి చేశారు. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని ఎం.విశ్వేశ్వరయ్య ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ స్టూడెంట్స్ చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12,710మందికి పైగా కాంట్రాక్టు టీచర్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్టు ఆయన తెలిపారు.
ఉన్నతమైన వృత్తిలో ఉంటూ ఎంతోమంది ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. ఆ జాబితాలోకి మరో ఉపాధ్యాయుడు చేరిపోయాడు.విద్యాబుద్ధులు నేర్పి వారిని తీర్చి దిద్దాల్సిన గురువు.. వారి చేతులతో మసాజ్ చేయించుకున్నాడు.
భారీ వర్షాలు వరంగల్ నగరాన్ని ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా వరదలతో నగర వాసులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇళ్లపై నుంచి సహాయం చేయాలని కోరుతున్నారు. ఇక, వరంగల్- హన్మకొండ మధ్య కనెక్టివిటీ పూర్తిగా తెగిపోయింది. అయితే, హంటర్ రోడ్డులోని ఓ లేడీస్ హాస్టల్ లో 200 మంది విద్యా్ర్థినీలు చిక్కుకున్నారు.