Islamia University: పాకిస్థాన్ ఇస్లామియా వర్సిటీలో ఘోరం…. బయట పడిన సెక్స్ కుంభకోణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Islamia University: పాకిస్థాన్‌లోని ఇస్లామియా యూనివర్సిటీలో ఘోరం జరిగింది. వర్సిటీలో సెక్స్ కుంభకోణం జరిగినట్టు బహిర్గతం అయింది. వర్సిటీలో 5వేల పోర్న్ వీడియోలు లభ్యమయ్యాయి. పాకిస్థాన్‌లోని బహవల్‌పుర్ ఇస్లామియా యూనివర్సిటీలో దారుణమై నిజాలు బయటపడ్డాయి. ఆ వర్సిటీలో డ్రగ్స్, సెక్స్ కుంభకోణం చోటుచేసుకున్నట్లు తేలింది. వర్సిటీ విద్యార్థులకు చెందిన సుమారు అయిదు వేల ఫోర్న్ వీడియోలు కూడా లభ్యం అయ్యాయి. ఈ ఘటనతో దేశంలో ప్రకంపనలు మొదలయ్యాయి. డ్రగ్స్‌కు బానిసైన విద్యార్థినులకు చెందిన వీడియోలు కలవరం సృష్టిస్తున్నాయి. వర్సిటీకి చెందిన సిబ్బంది నుంచి పోలీసులు ఆ వీడియోలను సీజ్ చేశారు. బహవల్‌పుర్ వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజా ఘటనతో ఆ వర్సిటీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఎపిసోడ్లో కేంద్ర మంత్రి చౌదరీ తారిక్ బాషిర్ చీమా కుమారుడు మాస్టర్‌మైండ్‌గా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అతను డ్రగ్స్ దందాకు పాల్పడుతున్నట్లు తేలింది. ఆ డ్రగ్స్ వల్లే వందల సంఖ్యలో ఇస్లామియా యూనివర్సిటీలో చదువుకుంటున్న మహిళా విద్యార్థులు సెక్స్ ఊబిలోకి దిగుతున్నట్లు భావిస్తున్నారు.
Read also: Bolla Brahmanaidu: టీడీపీ నేతలే రాళ్ల దాడి చేశారు, అరాచకం, విధ్వంసం సృష్టించారు
Also Read
- Pakistan minister: ఉగ్రవాదం, సింధు జలాలపై పాక్ మంత్రి దాటవేత!
- Putin Praises India: భారత్‌లో ఇన్ని భాషలా? ఈ వైవిధ్యం అద్భుతం.. పుతిన్ ప్రశంసలు!
- Nepal PM Balen Shah: సంప్రదాయానికి భిన్నంగా నేపాల్ ప్రధాని అడుగులు.. మోదీ, ముర్ములకు అరుదైన చారిత్రక బహుమతులు!
- Seattle Airport Chaos: ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. విమానం ఎక్కుతుండగా ఇద్దరిని ఈడ్చుకెళ్లిన ICE అధికారులు!
టాప్ సెక్యూర్టీ అధికారి మేజర్ ఇజాజ్ షా వద్ద అప్రోడిసియాక్ పిల్స్‌తో పాటు డ్రగ్స్ కూడా లభించాయి. ఐయూబీ విద్యార్ధులు, ఉద్యోగుల అశ్లీల వీడియో రికార్డింగ్స్ కూడా ఆయన వద్ద లభించాయి. మంత్రి చీమా తన కుమారుడిని రక్షించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేసును చేధించడం కోసం అయిదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు వర్సిటీలో దర్యాప్తు ప్రారంభించారు. తనిఖీల్లో వందల సంఖ్యలో పోర్న్ వీడియోలు దొరికాయి. యూనివర్సిటీ సెక్యూర్టీ ఆఫీసర్ ఇజాజ్‌ను పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేరున్న యూనివర్సిటీలో ఇటువంటి సెక్స్ కుంభకోణం బయట పడటంతో ఏమీ చేయాలో.. ఎలా కేసును పరిష్కరించాలో తెలియక ప్రభుత్వం తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. త్వరగా కేసును పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ వైస్ఛాన్స్ లర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read also: Etela Rajender: మాటలు గొప్పగా ఉంటాయి.. పరిహారం మాత్రం దిక్కు లేదు..
పోలీసులు యూనివర్సిటీ కోశాధికారిని అరెస్టు చేశారు, అతని నుండి మెత్ మరియు కామోద్దీపనలను స్వాధీనం చేసుకున్నారు. వర్సిటీ యొక్క చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర విద్యార్థులు మరియు సిబ్బంది యొక్క అభ్యంతరకరమైన వీడియోలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. విచారణలో అరెస్టయిన అధికారుల మొబైల్ ఫోన్లలో అనేక వాట్సాప్ చాట్లు, స్పష్టమైన వీడియోలతో పాటు అనేక ఆధారాలు బయటపడ్డాయి. మాదకద్రవ్యాల ఆరోపణలపై అరెస్టయిన ఇద్దరు వర్సిటీ అధికారులు విద్యార్థులను, యూనివర్శిటీ ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసి లైంగిక దోపిడీకి పాల్పడ్డారని పోలీసుల నివేదికలో పేర్కొన్నారు. అరెస్టు చేయబడిన వర్సిటీ కోశాధికారి “తాను ఇతర ఉపాధ్యాయుల బృందంతో కలిసి విద్యార్థుల ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి పంపిణీ చేస్తానని మరియు డ్యాన్స్/సెక్స్ పార్టీలను ఏర్పాటు చేస్తానని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు అమ్మాయిలను దోపిడీ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని డ్రగ్స్‌తో వారిని ఇరికించేస్తుందని పోలీసులు పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతోందని, ఆర్థికంగా వెనుకబడిన, బలహీనమైన నేపథ్యాలకు చెందిన బాలికలే లక్ష్యంగా చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Man Rescued: డ్రైనేజీలో చిక్కుకున్న వ్యక్తి.. నాలుగు రోజుల తర్వాత సురక్షితంగా బయటకు..
-
Pakistan minister: ఉగ్రవాదం, సింధు జలాలపై పాక్ మంత్రి దాటవేత!
-
Nitin Nabin: రాహుల్ గాంధీతో చర్చకు బీజేపీ మండలాధ్యక్షుడు చాలు..
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Hyderabad News : హైదరాబాద్ ఉగ్రదాడి బెదిరింపు మెయిల్ ఫేక్.. నిర్ధారించిన పోలీసులు
ట్రెండింగ్
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..