2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, అటనామస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి అధికారులు నిన్న (ఆదివారం) నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఎండల తీవ్రత తగ్గకపోవటంతో రాష్ట్ర విద్యాశాఖ ఈ నెల 24వరకు ఒంటిపూట బడులు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించాలని తెలిపింది.
సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హమ్ వీధుల్లో ఒక దుండగుడు జరిపిన దాడిలో ముగ్గురు చనిపోయారు. వారిలో ఒకరు భారత సంతతికి చెందిన యువతి ఉన్నారు. యువతి వైద్య విద్యను అభ్యసిస్తోంది.
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాల్లో బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ఈసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి.
తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
ఏపీలో నేటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకుచదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ.. క్రోసూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్.
ఆంధ్రప్రదేశ్ లో వేసవి సెలవులు ఇవాళ్టి( ఆదివారం)తో ముగిసిపోనున్నాయి. రేపటి( సోమవారం) నుంచి స్కూళ్లు పున: ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌కు విద్యార్థుల తల్లిదండ్రులు వేసవి సెలవులు పొడిగించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. పాఠశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని వారు కోరుతున్నారు.