AP Students in USA: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పర్యటన అమెరికా గడ్డపై కొనసాగుతోంది.. ఐక్యరాజ్యసమితి, కొలంబో యూనివర్సిటీ తదితర చోట్ల ప్రసంగించారు మన పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు.. అమెరికాలో రెండో రోజు పర్యటనలో భాగంగా.. సెప్టెంబర్ 17న న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ‘ఎడ్యుకేట్ ఎ చైల్డ్’ సెమినార్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. 10 మంది విద్యార్థులతో కూడిన బృందం కెనడా, ఉగాండా, కెన్యా వంటి వివిధ దేశాల విద్యార్థులతో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, పర్యావరణ అంబాసిడర్‌గా ఎలా ఉండాలి మరియు ప్రపంచవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను ఎలా పెంచాలి వంటి విభిన్న అంశాలపై చర్చలు జరిపారు.. ఈ చర్చల్లో మన విద్యార్థులు పాల్గొన్నారు.
Read Also: Lavanya Tripathi: పెళ్ళికి ముందే వరుణ్ ఇంట లావణ్య..ఎందుకంటే?
ఇక, టీమ్ చర్చల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, విద్యార్థులందరికీ సమతుల్య మరియు పౌష్టికాహారాన్ని అందించడం, మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, బైజూస్ టాబ్లెట్ల వినియోగం వంటి చర్యలతో విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈ సమావేశంలో ప్రత్యేకంగా వివరించింది. ఉత్తమ బోధనా పద్ధతులు, విద్యార్థుల్లో భాషా నైపుణ్యం పెంచేందుకు అందిస్తున్న ద్విభాషా పాఠ్యపుస్తకాల పరిచయంపై జరిగిన చర్చలో ఏపీ విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. కాగా, ఏపీ ప్రభుత్వం విద్యావిధానంలో కీలక మార్పులు తీసుకొచ్చిన విషయం విధితమే.. మన విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడేలా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం వైఎస్ జగన్.. దీనికోసం పలు అంతర్జాతీయ సంస్థలతో ఎంవోయూలు సైతం కుదుర్చుకున్నారు.