US White House: వైట్‌హౌస్‌లో ఆంధ్రా విద్యార్థులు సందడి.. కారణం ఇదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి బాలలను తీర్చిదిద్ది పౌరులుగా మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులది. ప్రభుత్వం సహకరిస్తే ఉపాధ్యాయులు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని.. విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసి ఖండాలు దాటించగలరని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ లోపల అడుగుపెట్టారు. వివరాలలోకి వెళ్తే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి అంతర్జాతీయ వేదికపై వివరించేందుకు రాష్ట్రంలో సంక్షేమ పథకాల నుండి లబ్ది పొందుతున్న వారు చెప్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10 మంది పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది ప్రభుత్వం.
Read also:Food Packing: వామ్మో నిజమేనా..? ఇందులో ఉన్న ఆహారం తింటే కాన్సర్ గ్యారెంటీనా..!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
కాగా విద్యార్థుల బృందం ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ పర్యవేక్షణలో ఈనెల 14న అమెరికాకు వెళ్ళింది. ఐక్యరాజ్య సమితిలో ఎస్డీజీ సదస్సుకు వెళ్లారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. ఈ నేపథ్యంలో బుధవారం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను కూడా సందర్శించారు. వైట్‌హౌస్ బయట ప్రాంతాలను చూసేందుకు మాత్రమే అనుమతిని ఇస్తారు ఆ దేశం అధికారులు. అయితే మొదటిసారిగా మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భవనం లోపలి ప్రదేశాలను సందర్శించేందుకు అవకాశం కలిపించారు. వైట్ హౌస్ భద్రత సిబ్బంది దగ్గర ఉండి వైట్ హౌస్ మొత్తం తిప్పి చూపించారు. భవనంలో ప్రతి ఒక్క విభాగం పనితీరును విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. అన్ని సందర్శించిన విద్యార్థులు తిరిగి స్వదేశానికి పయనమైయ్యారు. కాగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో అడుగు పెట్టడం ఇదే మొదటిసారి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?