Mysore: చినుకు చినుకు కలిసి గాలి వానగ మారినట్టు. ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన గొడవ ఓ విద్యార్థి ప్రాణాలను బలితీసుకుంది. కాలేజీకి వెళ్లి చదువుకుని ఉద్ధరిస్తారు అని కాలేజికి పంపిన తల్లిదండ్రులకు తీరని శోఖం మిగిలింది. ఒకరికి కన్న కొడుకు శాశ్వతంగా దూరమై తీరని దుఃఖాన్ని మిగిల్చాడు. మరొకరికి కన్న కొడుకు హంతకుడిగా మారి వేదన పాలు చేసాడు. ఈ హృదయ విదారక ఘటన మైసూరులో చోటు చేసుకుంది.
Read also:India-China: భారత ఆటగాళ్లకు అనుమతివ్వని చైనా.. పర్యటన రద్దు చేసుకున్న అనురాగ్
వివరాలలోకి వెళ్తే.. మహాదేవపురకు చెందిన కృష్ణ (17) మైసూరు నగరంలోని జేపీ నగర్ లోని కళాశాలలో పీయూసీ చదువుతున్నాడు. ఎప్పటి లానే కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ కి వెళ్ళాడు కృష్ణ. కాగా అక్కడ కృష్ణకి మరియు తనతోపాటు చదువుకుంటున్న మరో విద్యార్థికి మధ్య చిన్న గొడవ జరిగింది. ల్యాబ్ లో గొడవని ల్యాబ్ లోనే వదిలెయ్య లేదు ఇద్దరు విద్యార్థులు. కళాశాల ముగిశాక కళాశాల బయటకి వచ్చి మరల ఇద్దరు కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ గొంతు దగ్గర బలంగా దెబ్బ తాకడంతో క్కడికక్కడే కింద పడిపోయాడు . ఇది గమనించిన స్థానికులు కృష్ణని ఆసుపత్రికి తరలించారు. కాగా కృష్ణ చికిత్స పొందుతూ మరణించాడు. కొడుకు మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. కాగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు పై దర్యాప్తు చేస్తున్నారు.