ఒకప్పుడు గొడవ అవుతుందంటే వెంటనే పదిమంది జనం పోగై.. ఆ గొడవను ఆసక్తిగా తిలకించేది. అందులో కొట్టుకోవడం లాంటి సీన్లు వస్తే.. ఆపేది పోయి సినిమా చూసినట్లు చూశేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి అలాంటి వాటిపై ఇంట్రెస్టింగ్ తగ్గినట్లుంది జనాలకు.. ఎందుకంటే గొడవలకు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో రకాలైనా వీడియోలు కనిపిస్తున్నాయి. దాంతో సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతున్నాయి.
Rohit Sharma: ఆ ఫార్మాట్లో రోహిత్ శర్మ కనిపించడు.. హిట్మ్యాన్ సంచలన నిర్ణయం..!
తాజాగా ఇద్దరు విద్యార్థులు క్లాస్ రూంలో కొట్టుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు స్టూడెంట్స్ క్లాస్ రూమ్‌లో గొడవ పడుతున్నారు. అయితే వారిద్దరూ సీటు కోసం గొడవ పడుతుండటంలా అనిపించింది. ఈ ఫైట్ కి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఇద్దరు విద్యార్థులు సీటుకోసం ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్నారు. అయితే వారిద్దరు కొట్టుకోవడం ఆపకపోవడంతో తోటి విద్యార్థులు వారిని విడిపించారు. కాగా.. వారు కొట్టుకోవడం చూసి తోటి విద్యార్థులు పగలబడి నవ్వుతున్నారు.
ED Rides: మాజీ ఎంపీ గడ్డం వినోద్ ఇంట్లో సోదాలపై ఈడీ ప్రకటన
ఈ వీడియోను ఘర్ కే క్లీష్ అనే వినియోగదారు Xలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 82 వేల మందికి పైగా వీక్షించారు. కాగా.. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘వారు చదువుకోవడానికి వచ్చేది ఇందుకోసమేనా’ అని ఒక వినియోగదారు కామెంట్ చేశాడు. మరో వినియోగదారు.. ‘అలాంటి విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుంది. అని తెలిపాడు. ‘విద్యార్థులు చదువులపై దృష్టి పెట్టాలి’ మరొకరు కామెంట్ చేశాడు.
Kalesh b/w Two Boys inside Allen Classroom over Seat issues
pic.twitter.com/zFzZPswkww— Ghar Ke Kalesh (@gharkekalesh) November 18, 2023