బ్రిటన్ లో చదువుకునే వారికి అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బ్రిటన్‌లో చదువుకునేందుకు భారత్‌తో పాటు విదేశాల నుంచి వెళ్లే విద్యార్థులు తమ బంధువులను తమ వెంట తీసుకెళ్లకూడదని చెప్పారు. అయితే, పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ కోర్సులతో పాటు ప్రభుత్వ నిధులతో నడిచే కోర్సుల విద్యార్థులకు మినహాయింపు ఇచ్చింది. విదేశీ విద్యార్థులతో పాటు బంధువుల సంఖ్య పెరగడంతో బ్రిటీష్ ప్రభుత్వం జనవరి 1 నుంచి నుంచి కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్రిటీష్ యూనివర్సిటీల్లో చదువుతున్న వారిలో చైనా తర్వాత భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు.
Read Also: Bhavani Deeksha Viramana: రేపటి నుంచి భవానీ దీక్షా విరమణ.. ఇంద్రకీలాద్రిపై విస్తృత ఏర్పాట్లు
అయితే, జనవరి 1 నుంచి అమలు చేస్తున్న వీసా మార్గాలపై ఆంక్షల కారణంగా భారత్‌తో సహా విదేశీ విద్యార్థులు తమ బంధువులను బ్రిటన్‌కు తీసుకురాలేరని ఆ దేశ హోం మంత్రి జేమ్స్ క్లీవర్లీ తెలిపారు. వేలాది మంది వలసలను తగ్గించడానికి.. దేశంలోని ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ప్రజలు మార్చకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను అమలు చేసింది అని చెప్పారు. కాగా, ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 2022 నాటికి 7.45 లక్షల మంది వలసదారులు బ్రిటన్‌కు వచ్చారు. ఇక, సెప్టెంబర్ 2023 చివరి నాటికి విద్యార్థులపై ఆధారపడిన వారికి 1.52 లక్షల వీసాలు జారీ చేయబడ్డాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. 2022లో 1.39 లక్షల మంది భారతీయ విద్యార్థులు బ్రిటన్‌కు చదువుల కోసం వచ్చారు.