Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sridhar Babu: రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పాలనను మరింత వేగవంతం, పారదర్శకం చేసేందుకు ప్రభుత్వం అనేక విప్లవాత్మక డిజిటల్ కార్యక్రమాలను చేపడుతోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శాసనసభ, మండలి వ్యవహారాలను సంపూర్ణంగా డిజిటలైజ్ చేస్తూ త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. GOVconnect, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (మీసేవ) సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన “ఏఐ ట్రాన్స్ఫార్మేషన్ కాంక్లేవ్ (తెలంగాణ)”ను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ప్రసంగించారు. డిజిటల్ ఆఫీస్ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వ శాఖల్లో పేపర్ లెస్ పాలనకు పెద్దపీట వేస్తున్నామని, నకిలీ పత్రాలకు తావులేకుండా భద్రమైన బ్లాక్‌చెయిన్ ఆధారిత సర్టిఫికెట్ల సేవలను త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు.
గ్రామీణ ప్రాంతాల సాధికారత లక్ష్యంగా టీ-ఫైబర్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలకు హైస్పీడ్ డిజిటల్ కనెక్టివిటీని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి శ్రమ లేకుండా ప్రభుత్వ పౌర సేవలను నేరుగా వారి ఇంటి ముంగిటకే చేరవేసే వ్యవస్థను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. పాలనా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 20కి పైగా ప్రధాన ప్రభుత్వ శాఖలను ఒకే వేదికపైకి తెచ్చి, పథకాల అమలును నిరంతరం పర్యవేక్షించేందుకు రియల్ టైమ్ గవర్నమెంట్ డ్యాష్ బోర్డును రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎంవో చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ప్రవీణ్ పరదేశి, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఎండీ జీవీఎల్ సత్య కుమార్, నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా సీఈవో డాక్టర్ దేవేష్ త్యాగి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అడిషనల్ సెక్రటరీ సౌరభ్ కె.తివారీలతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!