Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepika Padukone Raka Shooting Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘రాకా’. ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో బన్నీతో పాటు దీపికా కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
అయితే దీపికా పదుకొనే వ్యక్తిగత కారణాల నేపథ్యంలో షూటింగ్‌కు కొంతకాలం విరామం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుత రాకా ముంబై షెడ్యూలే ఆమె పాల్గొనే చివరి షెడ్యూల్ అని చర్చ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత దీపికాకు సంబంధించిన షూటింగ్ పోర్షన్ దాదాపు పూర్తయ్యే అవకాశం ఉందని టాక్. ముంబై షెడ్యూల్లోనే దీపికాపని పూర్తవనుందట. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే చిత్రీకరణ ఇంకా భారీగా మిగిలి ఉన్నట్లు సమాచారం. 100 రోజులకు పైగా షూటింగ్ చేయాల్సి ఉందని తెలుస్తోంది.
Also Read
- Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
భారీ హంగులతో, అత్యున్నత సాంకేతిక విలువలతో రాకా సినిమాను రూపొందిస్తున్న నేపథ్యంలో ప్రతి సన్నివేశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన సన్నివేశాలకు ఎక్కువ సమయం అవసరమవుతుండటంతో.. షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడం కంటే నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నారట. రాకాలో దీపికాతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం ముందు నుంచి జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే ‘రాకా’కు సంబంధించిన పూర్తి స్టార్ క్యాస్టింగ్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాతే సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!