CM YS Jagan: ఎనిమిదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా వారికి ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రేపు సీఎం వైఎస్ జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో 8వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్‌లు అందజేసే కార్యక్రమానికి శ్రీకారంట చుట్టనున్నారు.. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం జగన్.
Read Also: Balakrishna: పవన్ సినిమాల్లో కంటే రోడ్ల మీద ఎక్కువ కనపడుతున్నాడు!
ఇక, చింతపల్లి పర్యటన కోసం గురువారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరివెళ్లనున్నారు.. చింతపల్లి మండలం చౌడుపల్లి చేరుకోనున్న ఆయన.. చింతపల్లిలోని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్ధులతో మాట్లాడనున్నారు.. అనంతరం ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్..
Read Also: Covid Alert: కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. వైద్యారోగ్య శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్
కాగా, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేయనుంది ఏపీ ప్రభుత్వం.. రాష్ట్రంలోని 4.34 లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.. బైజూస్ కంటెంట్ ప్రీ లోడెడ్ ట్యాబ్‌లు అందజేయనున్నారు.. అయితే, ట్యాబ్‌లలో 8వ తరగతి విద్యార్థులతో పాటు 9, 10వ తరగతి విద్యార్థులకు కూడా బైజూస్ కంటెంట్ లోడ్ చేసి ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్న విషయం విదితమే.. ఈ ట్యాబ్ ల కోసం 620 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది వైఎస్ జగన్ సర్కార్.. ఈ ట్యాబ్‌ల విలువ 17,500 రూపాయలు కాగా.. అందులో 15 వేల రూపాయలకు పైగా విలువ చేసే బైజూస్ కంటెంట్‌ను వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ అందిస్తోంది.