సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ఓ సినిమా చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాత్కాలికంగా #SSMB29 పేరుతో పిలుచుకుంటున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. అయితే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ కోసం మల్టీస్టారర్ కాన్సెప్ట్‌ను సిద్ధం చేశాడని ఊహాగానాలు వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఓ అగ్ర నటుడు కీలక పాత్ర పోషించనున్నారని, సినిమాలో మరో ప్రధాన నటుడి ఎపిసోడ్ 40 నిమిషాల పాటు సాగుతుందని అన్నారు. పాన్ ఇండియన్ అప్పీల్ పొందడానికి…
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. ‘అల వైకుంఠపురము’లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తర్వాత త్రివిక్రమ్ క్రేజ్ మరింతగా ఎదిగింది. అయితే తాజాగా త్రివిక్రమ్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసినట్టు సమాచారం. మహేష్ బాబు ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్ ‘SSMB28’ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం త్రివిక్రమ్ ఏకంగా 50 కోట్ల రూపాయలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి మహేష్ ఎంత వసూలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం “SSMB28” ఇటీవలే గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి రావడానికి చాలా సమయం పడుతుందని టాక్. ఈ గ్యాప్ సినిమాపై పలు ఊహాగానాలు రావడానికి అవకాశం వచ్చింది. ఇటీవల సినిమా గురించి ఓ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ రూమర్ ఏమిటంటే… తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ను #SSMB28లో ఓ కీలకపాత్ర…
పూజా హెగ్డే తన సిజ్లింగ్ ఫోటోతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. బీచ్ వేర్ లో హీట్ రైజ్ చేస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది. తెల్లటి ఓపెన్ వీవ్ బీచ్‌వేర్‌లో పోజులిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మంత్రముగ్దులను చేస్తున్న ఈ స్టిల్ కు పూజా “అండ్ దెన్ ది సన్… సెట్” అని క్యాప్షన్‌గా ఇచ్చింది. ఇక ఈ క్లిక్‌ని కొంచెం ఆకర్షణీయంగా చేసింది ఆమె చిరునవ్వు. పూజా తన అద్భుతమైన డ్రెస్సింగ్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రానున్న కొత్త చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘SSMB28’ అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఈరోజు ఉదయం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే మహేష్ బాబు హాజరు కాలేదు. కానీ ఆయన తరపున మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్, పూజ హెగ్డే, త్రివిక్రమ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. Read Also…
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడింది. అధికారిక ప్రకటన ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ 12 సంవత్సరాల తిరిగి చేయబోతున్న…
సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అతడు, ఖలేజా సినిమాల తరువాత త్రివిక్రమ్- మహేష్ కాంబోపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా గురించి ఒక క్రేజీ రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రంలో మహేష్ చెల్లి పాత్రలో యంగ్ హీరోయిన్…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ‘ఎస్ఎస్ఎంబి28’ షూటింగ్ కోసం దుబాయ్‌లో ఉన్నారు. పనితో పాటు ఈ హీరో ఫ్యామిలీతో అక్కడే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడు. మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ తరచుగా వారి కుటుంబానికి సంబంధించిన అద్భుతమైన క్షణాలను కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా మహేష్ తన కుమార్తె సితారతో కలిసి సూపర్ కూల్ లుక్ లో ఉన్న చిత్రాన్ని…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో మహేష్ చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. “ఎస్ఎస్ఎంబి28” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా బుట్టబొమ్మ పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆ స్థానంలో…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కాలంలో సినిమాకు మాత్రమే సంబంధించి కాకుండా ఇతర కార్యక్రమాలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన ఒక ఫిట్నెస్ సెంటర్ ను ప్రారంభించారు. “మై ఓ మూమెంట్” అనే లైఫ్ స్టైల్ క్లబ్ ను లాంచ్ చేశారు. అందులో ఫిట్ నెస్, న్యూట్రిషన్, ఫీజియోథెరపీ వంటి సేవలను అందించనున్నారు. “ఫిట్‌నెస్ కోసం నా అన్వేషణలో ప్రపంచంలోని అత్యుత్తమ శిక్షకులతో పనిచేసే అవకాశం నాకు లభించింది. గాబ్రియేల్ మినాష్ ఆ జాబితాలో అగ్రస్థానంలో…