సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం “SSMB28” ఇటీవలే గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి రావడానికి చాలా సమయం పడుతుందని టాక్. ఈ గ్యాప్ సినిమాపై పలు ఊహాగానాలు రావడానికి అవకాశం వచ్చింది. ఇటీవల సినిమా గురించి ఓ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ రూమర్ ఏమిటంటే… తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ను #SSMB28లో ఓ కీలకపాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాలో విక్రమ్ నెగెటివ్ రోల్ లో కన్పించవచ్చని జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా విక్రమ్ వర్గం నుంచి ఈ రుమార్ పై క్లారిటీ రావడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.
Read Also : Sridevi death anniversary : జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
హీరో విక్రమ్ మేనేజర్ తన ట్విట్టర్ లో విక్రమ్ #SSMB28లో కనిపించడం లేదని ప్రకటించారు. “డియర్ ఫ్రెండ్స్, #ChiyaanVikram @urstrulyMaheshతో ఏ ప్రాజెక్ట్‌లోనూ భాగం కాదు. దీనికి సంబంధించి వస్తున్న పుకార్లు నిరాధారమైనవి. అటువంటి వార్తలను ప్రచురించే ముందు దయచేసి మమ్మల్ని సంప్రదించాలని నేను మీడియా సంస్థలను అభ్యర్థిస్తున్నాను. అభినందనలు’ అని సూర్యనారాయణన్ ట్వీట్ చేశారు. దీంతో పుకార్లకు చెక్ పడింది.