పూజా హెగ్డే తన సిజ్లింగ్ ఫోటోతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. బీచ్ వేర్ లో హీట్ రైజ్ చేస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది. తెల్లటి ఓపెన్ వీవ్ బీచ్‌వేర్‌లో పోజులిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మంత్రముగ్దులను చేస్తున్న ఈ స్టిల్ కు పూజా “అండ్ దెన్ ది సన్… సెట్” అని క్యాప్షన్‌గా ఇచ్చింది. ఇక ఈ క్లిక్‌ని కొంచెం ఆకర్షణీయంగా చేసింది ఆమె చిరునవ్వు. పూజా తన అద్భుతమైన డ్రెస్సింగ్ సెన్స్‌తో ఫ్యాషన్ ప్రియులను అలరిస్తోంది.
Read Also : షాకింగ్ లుక్ లో ఇలియానా… నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
పూజాహెగ్డే సినిమాల విషయానికొస్తే… ‘SSMB28’ అనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో పూజ సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ ను గ్రాండ్ లాంచ్ వేడుకతో ప్రకటించారు. ఇక పూజా హెగ్డే అభిమానులకు మరో శుభవార్త. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘రాధే శ్యామ్’ మార్చి 11న థియేటర్లలోకి రానుందని మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయిక. చాలా ఆలస్యం తర్వాత ప్రేక్షకులు పెద్ద స్క్రీన్‌లపై ఈ రొమాంటిక్ డ్రామాని చూడబోతున్నారు.