పిక్ : సూపర్ కూల్ లుక్ లో సితారతో మహేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ‘ఎస్ఎస్ఎంబి28’ షూటింగ్ కోసం దుబాయ్‌లో ఉన్నారు. పనితో పాటు ఈ హీరో ఫ్యామిలీతో అక్కడే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడు. మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ తరచుగా వారి కుటుంబానికి సంబంధించిన అద్భుతమైన క్షణాలను కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా మహేష్ తన కుమార్తె సితారతో కలిసి సూపర్ కూల్ లుక్ లో ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు.
ఈ పిక్ లో మహేష్, సితార కలిసి బ్రేక్ ఫాస్ట్ కోసం వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇక వీరిద్దరి దుస్తుల ఫ్యాషన్ ఆకట్టుకుంటోంది. నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోను పంచుకుంటూ ఒక బిటిఎస్ కథను కూడా రాసింది. “అసంఖ్యాకమైన పక్షులు, తేనెటీగలు వంటి అందమైన జీవుల మధ్య పచ్చిక బయళ్లలో వారి రుచికరమైన అల్పాహారం తినడానికి సిద్ధంగా ఉన్న ఈ ఇద్దరికి తెల్లవారుజామున ఎప్పుడూ పని ఉండదు. అవును .. రోజుకి సంబంధించిన ప్లాన్ ప్రతిరోజూ ఇక్కడే tjis టన్నెల్‌లో రూపొందుతుంది. ప్రతి ఉదయం ఒక తాజా గమనికతో తయారు అవుతుంది. సో ఈ రోజు నేను ఈ విజువల్ క్యాప్చర్‌ని తీయడానికి ముందుకు నడిచాను. కాబట్టి నేను కార్డ్‌లలోని మెనుని కోల్పోయాను !! కానీ అది ఆమెకు అప్పగించాలి. ఆమె అల్పాహారం ఉత్తమమైనది, తక్కువ సంక్లిష్టమైనది. నేను ఈ ఇద్దరి నుండి నేర్చుకోవడం ప్రారంభించే సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను” అంటూ తండ్రీ కూతుళ్ళ గురించి సుదీర్ఘమైన పోస్టును పంచుకుంది నమ్రత.
Also Read

కాగా ‘ఎస్ఎస్ఎంబి28’ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధా కృష్ణ నిర్మించారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో అతడు (2005), ఖలేజా (2010) చిత్రాలలో కలిసి పని చేశారు. ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి చేతులు కలిపారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
DDA Karmayogi Awas Yojana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫ్లాట్లపై 25 శాతం డిస్కౌంట్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..!
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
ట్రెండింగ్
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!