‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడింది. అధికారిక ప్రకటన ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ 12 సంవత్సరాల తిరిగి చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయగా, ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమాను “ఎస్ఎస్ఎంబి 28” అనే టైటిల్ తో పిలుస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు సంగీత సంచలనం ఎస్.ఎస్.తమన్ మ్యూజిక్ అందించనున్నారు.
Read Also : “విజయ్ దేవరకొండ తుఫాన్” స్టార్ట్… పేరు మార్చుకున్న హీరో
తాజా సమాచారం మేరకు ఈ సినిమా ప్రారంభోత్సవం ఫిబ్రవరి మూడో తేదీన అంటే గురువారం నాడు హైదరాబాద్ లో వైభవంగా జరగనుంది. అయితే ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఇంకా పూర్తి కాని ఈ నేపథ్యంలో రెగ్యులర్ షూటింగ్ మాత్రం మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. పూజా హెగ్డే ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. మరో హీరోయిన్ గా సంయుక్త మీనన్ ను ఎంపిక చేసుకోవడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించనున్నారు. ఇందులో మహేష్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం అన్ని కమర్షియల్ హంగులతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది.