ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. ‘అల వైకుంఠపురము’లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తర్వాత త్రివిక్రమ్ క్రేజ్ మరింతగా ఎదిగింది. అయితే తాజాగా త్రివిక్రమ్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసినట్టు సమాచారం. మహేష్ బాబు ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్ ‘SSMB28’ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం త్రివిక్రమ్ ఏకంగా 50 కోట్ల రూపాయలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి మహేష్ ఎంత వసూలు చేస్తున్నాడో అంతే మొత్తాన్ని త్రివిక్రమ్ కూడా వసూలు చేస్తుండడం గమనార్హం.
Read Also : RRR : మరో కాంట్రవర్సీలో జక్కన్న మూవీ
ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు 50 కోట్ల భారీ పారితోషికం తీసుకుంటున్నాడని అంటున్నారు. సితార, హారిక హాసిని క్రియేషన్స్‌కు హోమ్ డైరెక్టర్‌గా ఎదిగిన త్రివిక్రమ్ మొత్తానికి హీరోకి పోటీగా రెమ్యూనరేషన్ ను అందుకుంటుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘అల వైకుంఠపురము’లో తర్వాత త్రివిక్రమ్ తన రెమ్యునరేషన్‌ను పెద్ద ఎత్తున పెంచాడు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో రాజమౌళి తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుడు త్రివిక్రమ్. ఇక ‘సర్కారు వారి పాట’ను మహేష్ పూర్తి చేసిన వెంటనే ‘SSMB28’ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వస్తుంది. త్రివిక్రమ్ ప్రస్తుతం SSMB28కి సంబంధించిన స్క్రిప్టింగ్ పార్ట్‌పై దృష్టి పెట్టారు.