సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అతడు, ఖలేజా సినిమాల తరువాత త్రివిక్రమ్- మహేష్ కాంబోపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా గురించి ఒక క్రేజీ రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రంలో మహేష్ చెల్లి పాత్రలో యంగ్ హీరోయిన్ సాయి పల్లవి కనిపించనున్నదట. ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ని త్రివిక్రమ్ వర్క్ అవుట్ చేస్తున్నాడంట. కీలక పాత్ర కావడంతో సాయి పల్లవి అయితే బావుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఆమె కూడా పాత్ర నచ్చడంతో ఓకే చెప్పినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలపై మహేష్ బాబు ఫ్యాన్స్, సాయి పల్లవి ఫ్యాన్స్ గుర్రుమంటున్నారు.
ఇద్దరు పెయిర్ గా కనిపిస్తారు అనుకుంటే.. అన్నాచెల్లెళ్ళను చేశారేంటి ..? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ తో సాయి పల్లవి డాన్స్ స్టెప్పులు వేస్తే చూడాలని కోరుకుంటున్నట్లు అభిమానులు తమ ఆసక్తిని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా స్టార్ హీరో సరసన సిస్టర్ గా చేస్తే ఆమె కెరీర్ ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. అయితే ‘బోళా శంకర్’ చిత్రంలో చిరుకు సిస్టర్ గా నటించే అవకాశం కోల్పోయిన సాయి పల్లవి ఈ అవకాశాన్ని వదులుకోకూడదని అనుకుంటున్నదట.. మరి ఇదే కనుక నిజమైతే మహేష్- సాయి పల్లవి కెమిస్ట్రీ ని మిస్ అయినట్లే అంటున్నారు అభిమానులు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.