శ్రీశైల దేవస్థానంలో శుక్రవారం నుంచి శ్రావణ మాసోత్సవాలు ప్రారంభంకానున్నాయి.. రేపటి నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు శ్రీశైలం క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నట్టు ఈవో లవన్న తెలిపారు.. శ్రావణ మాసోత్సవాల సందర్భంగా దేవస్థానంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.. ఇక, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని.. శ్రావణ శని, ఆది, సోమ, పౌర్ణమి రోజులలో స్వామివారి గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలిపివేయనున్నట్టు ప్రకటించారు ఈవో లవన్న… సామూహిక అభిషేక భక్తులకు శ్రావణ శని,…
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీశైలం,కాశీపీఠాధిపతులు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని కాశీ జ్ఞానసింహాసన నూతన పీఠాధిపతి మల్లికార్జున విశ్వరాధ్య,శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామాశివాచార్య దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న పీఠాధిపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు, ఆలయచైన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అభిషేకం జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. పీఠాధిపతుల వెంట వివిధ మఠాలకు సంబంధించిన మఠాధిపతులు కూడా విచ్చేసి స్వామి అమ్మవారిని…
ప్రముఖ దేవాలయం శ్రీశైలంలో షాపుల కేటాయింపు ఉత్కంఠ రేపింది. దుకాణాదారులు దేవస్థానం అధికారుల తీరుపై నిరసన తెలిపారు. చివరకు పోలీసుల పటిష్ట భధ్రత నడుమ సాగిన షాపుల లక్కీ డిప్ లో కేవలం 24 మంది మాత్రమే పాల్గొన్నారు. మొత్తం షాపుల వేలంలో దుకాణా దారులు పాల్గొనలేదు. శ్రీశైలం దేవస్దానం పరిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దేవస్దానంలోని మార్కెట్ షాపు అసోసియేషన్ తరఫున దుకాణాదారులందరూ మెయిన్ బజార్ షాపులు మొత్తం మూసివేసి…
శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీశైలంలో మంగళవారం, శుక్రవారాలలో స్వామివారి ఉచిత స్పర్శదర్శనం వుంటుంది. అయితే ఈ ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పులు చేశారు దేవస్థానం అధికారులు. శ్రీ శైలంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మంగళవారం నుండి శుక్రవారం వరకు భక్తులకు కల్పిస్తున్న మల్లికార్జునస్వామి స్పర్శ దర్శన వేళలు మార్చాలని దేవస్థానం నిర్ణయించింది. నేటినుండి నుంచి వారంలో నాలుగు రోజులపాటు అనగా మంగళ వారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటలనుంచి 4 గంటలవరకు…
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం ప్రాంగణంలో గత అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీ దుకాణం యజమానికి కన్నడ భక్తులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే రాత్రి ఒంటి గంట సమయంలో టీ తాగేందుకు వెళ్లిన కన్నడ భక్తుడు టీ దుకాణదారుడితో మంచినీళ్లు ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. దీంతో రెచ్చిపోయిన టీషాపు యజమాని సదరు కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఈ విషయం తెలిసిన కర్ణాటక భక్తులు రెచ్చిపోయారు.…
నేడు ఏపీ వ్యాప్తంగా నిరసనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు సిద్ధమయ్యాయి. ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరణకు తెలంగాణలో నేటితో గడువు ముగియనుంది. క్రమబద్ధీకరణ కోసం ఇప్పటివరకు 1.47 లక్షల దరఖాస్తులు వచ్చాయి. శ్రీశైలంలో రెండోరోజు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. సాయంత్రం మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనుంది. కైలాసవాహనంపై ఆశీనులై ఆది దంపతులు ప్రత్యేక పూజలందుకోనున్నారు. నేడు భారత్‌కు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ రానున్నారు. ప్రస్తుత…
CJI NV Ramana Visit Today Srisailam Temple. నేడు కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల పుణ్యక్షేత్రానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా విచ్చేయనున్నారు. ఆదివారం సాయంత్రం స్వామివారిని, అమ్మవారిని ధూళి దర్శనం చేసుకోనున్నారు. రాత్రి బస చేసి.. సోమవారం ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. అనంతరం కల్యాణోత్సవంలో పాల్గొంటారు. సీజేఐ రాక నేపథ్యంలో ఏపీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కంచిమఠంలో జరిగే హోమ పూర్ణాహుతిలో…
నేడు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించే ఛాన్స్ ఉంది. అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. నేటి నుంచి ఈ నెల 30 వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీల అమలు జరుగనుంది. తెలంగాణ ఈ చలాన్ వెబ్సైట్లో చెల్లించే అవకాశాన్ని పోలీసులు కల్పించనున్నారు. నేడు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ ఆలయాలు దేదీప్యమానంగా విద్యుత్ కాంతుల అలంకరణతో మెరిసిపోతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని…