Shivratri Brahmotsavam 2023: శివరాత్రి వస్తుందంటే చాలు శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగిపోతుంటాయి.. శివరాత్రికి ముందే ప్రముఖ శైవక్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు మొదలవుతుంటాయి.. ఇక, ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. ప్రతీ ఏడాది శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.. శివరాత్రిని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు.. శ్రీశైలంలో నేటి నుండి ఈనెల 21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. ఇవాళ ఉదయం 9 గంటలకు…
Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో TTD బోర్డు బెజవాడ కనకదుర్గమ్మ గుడి పాలకమండళ్లకు ప్రాధాన్యం ఎక్కువ. ఈ రెండు ఆలయాలతోపాటు రాష్ట్రంలో పలు కీలక గుళ్లు ఉన్నప్పటికీ.. అక్కడి ట్రస్ట్ బోర్డుల గురించి పెద్దగా ప్రచారం ఉండదు. మిగతా కీలక ఆలయాల్లో పాలకమండలిని నియమించిన తర్వాత ఒకరోజో.. రెండు రోజులో చర్చ జరుగుతుంది. తర్వాత ఎవరూ పట్టించుకోరు. అలాంటి ఆలయాల్లో శ్రీశైలం కూడా ఒకటి. శ్రీశైలం ఆలయం పాలకమండలి చర్చల్లోకి వచ్చిన సందర్భాలు కూడా చాలా అరుదు.…
Srisailam Temple: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్ప ఇవాళ శ్రీశైలంలో పర్యటించారు.. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. నేతల పర్యటనతో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది.. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సీఎం, మాజీ సీఎం.. భ్రమరాంబికాదేవిని దర్శించుకోకుండానే వెళ్లిపోయారు.. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది.. ఎందుకంటే.. అమ్మవారిని తమ ఆడపడుచుగా భావిస్తారు కన్నడిగులు.. కానీ, అమ్మవారిని దర్శించుకోకుండానే బసవరాజు బొమ్మై, యడ్యూరప్ప…
శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన సూచన.. ఇవాళ్టి నుండి ఈనెల 23వ తేదీ వరకు శ్రీశైలం మల్లన్న స్పర్శదర్శనం నిలిపివేస్తున్నట్టు ప్రటించారు శ్రీశైలం దేవస్థానం ఆలయ ఈవో లవన్న… కార్తీకమాసం భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి స్పర్శదర్శనం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది దేవస్థానం… భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆర్జిత సేవ, స్పర్శదర్శనాలు నిలివేస్తూ దేవస్థానం నిర్ణయం తీసుకుందని ఈవో లవన్న వెల్లడించారు… అయితే, ముందస్తుగా ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకున్న భక్తులకు మాత్రం రేపు…
Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ప్రమాదం తప్పింది. అన్నపూర్ణ భవన్‌లో అల్పాహారం తయారీకి ఉపయోగించే బాయిలర్ పేలింది. పేలుడు ధాటికి బాయిలర్‌లోని ఎస్ఎస్ ట్యాంక్ ఎగిరిపడింది. ఘటనాస్థలిలో సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నిత్యాన్నదానం నిర్వహించే చోట ఈ ప్రమాదం జరిగింది. స్టీమింగ్ బాయిలర్ బాగా వేడేక్కడంతో పేలిపోయినట్టుగా అక్కడ పనిచేసే సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఈ బాయిలర్ పేలుడు కారణంగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా దేవస్థానం…