Bobbillanka Murder: బొబ్బిల్లంకలో జంట హత్యలు.. భార్య, అత్తను నరికి చంపిన వ్యక్తి
- తూర్పు గోదావరి జిల్లా బొబ్బిల్లంకలో జంట హత్యలు
- భార్య, అత్తను నరికి చంపిన వ్యక్తి
- కుటుంబ గొడవలే హత్యకు కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ విభేదాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన మొదటి భార్యతో పాటు అత్తను కత్తితో నరికి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జననివాస ప్రాంతాల్లో ఈ ఘటన జరగడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికుల వివరాల మేరకు డబుల్ మర్డర్ వివరాలు ఇలా ఉన్నాయి..
చోడదాసి సీతారామరాజు తన మొదటి భార్య లత (30), అత్త గుమ్మడి లక్ష్మి (50)పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నేరానికి ఉపయోగించిన కత్తిని గోదావరిలో పడేసి సీతానగరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. 15 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న సీతారామరాజు, లతలకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా విడిగా ఉంటున్నప్పటికీ.. ఒకే వీధిలో నివసిస్తున్నారు. నిందితుడు సీతారామరాజు ప్రస్తుతం మరో మహిళను వివాహం చేసుకున్నాడు.
Also Read
- Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
Also Read: IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!
మొదటి భార్యపై అనుమానంతో సీతారామరాజు సోమవారం అర్ధరాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లాడు. భార్య, అత్తను కత్తితో నరికి అతి కిరాతకంగా నరికి హత్య చేశాడు. ఆపై నిందితుడు సీతారామరాజు పోలీసులకు లొంగిపోయాడు. ఈ మేరకు సీతానగరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!