శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం ప్రాంగణంలో గత అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీ దుకాణం యజమానికి కన్నడ భక్తులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే రాత్రి ఒంటి గంట సమయంలో టీ తాగేందుకు వెళ్లిన కన్నడ భక్తుడు టీ దుకాణదారుడితో మంచినీళ్లు ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. దీంతో రెచ్చిపోయిన టీషాపు యజమాని సదరు కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఈ విషయం తెలిసిన కర్ణాటక భక్తులు రెచ్చిపోయారు. ఆలయ పరిసిరాల్లో ఉన్న షాపులపై దాడులు చేశారు. అంతేకాకుండా షాపులు ధ్వంసం, నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా భయానక వాతావరణం అలుముకుంది.
ఉగాది మహోత్సవాలకు లక్షల్లో కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు శ్రీశైలంకు వచ్చారు. ఈ ఘటన పాతాళ గంగ రోడ్ బీరప్ప సదం చోటు చేసుకుంది. ఆలయ పరిసరాల్లో, ఈఓ ఆఫీస్ కు వెళ్లే మార్గంలో ఫుట్ పాత్ లపై ఉన్న షాపులు ధ్వంసం చేస్తూ కన్నడ యువకుడు తగలబెట్టారు. విషయం తెలుసుకున్న
కన్నడ భక్తులు ఆగ్రహంతో సుమారు 100 తాత్కాలిక దుకాణాలు 20 కార్లు 10 బైక్ లు ధ్వంసం చేశారు. అంతేకాకుండా 20 ఫుట్ పాత్ షాపులు దగ్ధం చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు రంగంలోకి దిగి అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే డీఎస్పీ శృతి వచ్చాక వివాదం సద్దుమణిగినట్లు సమాచారం.