మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. 96 శైవ క్షేత్రాలకు వివిధ ప్రాంతాల నుంచి 3,225 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లా కోటప్ప కొండకు పలు ప్రాంతాల నుంచి 410 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా శ్రీశైలంకు పలు ప్రాంతాల నుంచి 390 బస్సులు, కడప జిల్లా పొలతల, నిత్య పూజకోన క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు…
శ్రీశైలం వెళ్లే భక్తులకు మల్లన్న ఆలయ అధికారులు శుభవార్త అందించారు. భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు భక్తులకు స్పర్శ దర్శనాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులను ఆదేశాల మేరకు జిల్లా అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. రేపటి నుంచి ఐదు రోజుల పాటు అభిషేకం చేయించుకునే వారికి స్పర్శదర్శనం కల్పిస్తామన్నారు. అలాగే గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఉచితంగా…
సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. రజాక్ చక్రవ్యూహంలో శ్రీ శైలం పుణ్యక్షేత్రం విలవిలలాడుతోందన్నారు. సీఎం జగన్ వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రానికి రజాక్ అనే వ్యక్తి ఒక శాపగ్రస్తంలా తయారయ్యాడు.అతని అరాచకాలను ఎదిరిస్తే పదులు సంఖ్యలో కేసులు పెట్టించడం ద్వారా అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు.జరిగిన సంఘటనలను ఎదిరించి హైందవ ధర్మానికి అండగా ఉన్న బీజేపీ నేత బుడ్డా శ్రీ కాంత్ రెడ్డి పై కేసులు బనాయించారు.రజాక్…
నేటి నుండి శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పంచాహ్నిక దీక్షలతో క్షేత్రపరిధిలో 7 రోజులపాటు వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగానే ఎంతో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి యగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టానున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సాయంత్రం ధ్వజారోహణం నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఈనెల 18…
శ్రీశైలం ఆలయ ఈవో లవన్న ముఖ్య ప్రకటన జారీ చేశారు. శ్రీశైలంలో కొలువు దీరిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని సూచించారు. ముఖ్యంగా ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే వస్తేనే గర్భగుడిలోకి అనుమతిస్తామని ఆలయ ఈవో స్పష్టం చేశారు. సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత స్పర్శ దర్శనాలను రోజుకు రెండు సార్లు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. Read Also: తిరుపతి వాసులకు టీటీడీ…
ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బీజేపీ నేతగా, గోషామహల్ నుంచి తెలంగాణ అసెంబ్లీకి తొలుత ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా ఆయనకు పేరుంది. వివాదాలు కూడా తక్కువేం కాదు. హిందూత్వానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైల మల్లిఖార్జున స్వామి దర్శనానికి వచ్చారు. ఈసందర్భంగా రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీశైల దేవస్థానం మర్యాదను కాపాడటంలో సియం జగన్ విఫలం అయ్యారన్నారు. హిందూ దేవాలయాల పరిధిలో అన్యమతస్తులు వ్యాపారాలు చేయకూడదని వైఎస్సార్…
కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆర్జిత సేవలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. వీఐపీ బ్రేక్ దర్శనం, అభిషేకం టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని ఈవో స్పష్టం చేశారు. ఆర్జిత సేవా టికెట్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే తాము ఆధార్ నిబంధనను తీసుకొచ్చినట్లు ఈవో లవన్న చెప్పారు. Read Also: జనవరి 1 నుంచి విజయవాడలో బుక్ ఫెయిర్
పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కొందరు సెక్యూరిటీ గార్డుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. శ్రీశైలం దేవస్దానంలో కొంతమంది సెక్యూరిటీ గార్డులు తమ విధులు కాకుండా ఓవరాక్షన్ చేస్తున్నారు. శ్రీశైలం, సుండిపెంటకు చెందిన విద్యార్ధినీల మెయిల్ ఐడీలు హ్యాకింగ్ చేశారు. వారి ఫేస్ బుక్ లో అమ్మాయిల ఫోటోలు సేకరించి వారిని వేధిస్తున్నారు. అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడుతూ డబ్బు ఆశ చూపిస్తూ విద్యార్థినీలకు వల వేస్తున్న ఆడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పర్సనల్ ఫోటోలను చూపించి అమ్మాయిలను వేధించడం…
కర్నూలు జిల్లా శ్రీశైలం ముఖద్వారం సమీపంలో పెద్దపులి సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రోడ్డు దాటుతూ ప్రయాణికులకు పెద్ద పులి కనిపించింది. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. వాహనాలు నిలిపివేసి ఫోటోలు, వీడియోలు తీసిన ప్రయాణికులు. ఎన్టీవీ చేతిలో వీడియోలు వున్నాయి. పెద్ద పులి ఎటు నుంచి ఎటు వెళ్ళిందోనని టెన్షన్ పడుతున్నారు. అటవీ అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
కార్తీక మాసం లయకారుడు శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల. ఈ నెలలో పెద్ద ఎత్తున్న భక్తులు శివాలయాలను దర్శించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఈ రోజు భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో ఆలయం కిటికిటలాడింది. నేటి నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాస ఉత్సవాలు కొనసాగనున్నాయి. స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన…