దసరా అంటే భక్తులకు ఎంతో పవిత్రం. దసరా మహోత్సవాలకు శ్రీశైలం వెళ్ళాలని, స్వామి అమ్మవార్లను కనులారా దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ లవన్న తెలిపారు.ఈనెల 26 న ఉదయం అమ్మవారి యాగశాల ప్రవేశంతో దేవి శరన్నవరాత్రులను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఉత్సవరోజుల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు జరిగే పూజ కైంకర్యాలనీ పరిపూర్ణగా నిర్వహిస్తామన్నారు.
Read Also: Hyderabad Gymkhana: టికెట్ల కోసం పోటెత్తిన జనం.. భారీ క్యూ లైన్
ప్రతి రోజు అమ్మవారు నవదుర్గల అలంకారలలో దర్శనమిస్తారని, స్వామి అమ్మవారు వివిధ వాహనసేవలలో గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహిస్తామన్నారు. భక్తులు ఉత్సవాలను వీక్షించేందుకు వీలుగా గంగాధర మండపం వద్ద ఎల్ ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఈవో లవన్న మాట్లాడుతూ దర్శనాల విషయంలో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. అలానే ఇటీవల కాలంలో శ్రీశైల ఆలయంలో ఆర్జిత సేవా టికెట్ ధరలను పెంచారనే ఒక నానుడి ఈ మధ్యకాలంలో వినిపిస్తుందన్నారు. అలాంటివాటిలో వాస్తవం లేదని గతంలో ఉన్న ధరలనే అమలు చేస్తున్నారు.
కరోనా మహమ్మారి సమయంలో నిలిపివేసిన సేవలను పునప్రారంభించామన్నారు ఈవో లవన్న. అలానే ఇటీవల నూతనంగా ప్రవేశ పెట్టిన ఉదయస్తామనసేవ, ప్రదోషకాలసేవలు సైతం ఆలయ ట్రస్ట్ బోర్డ్ దేవాదాయశాఖ ఉన్నతాధికారులు,మంత్రి సూచనల మేరకు ప్రారంభించామని తెలిపారు. సామాన్య భక్తులకు ప్రముఖులకు ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు చేశామని ప్రముఖులకు రోజుకు మూడు సార్లు దర్శనాలు కల్పిస్తున్నామన్నారు. మరోవైపు శ్రీశైలం ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు శ్రీశైలం డ్యాం ని కూడా సందర్శించనున్నారు. డ్యాం నిండుకుండలా వుంది. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Anurag Thakur : పీఎల్‌ఐ పథకం రెండవ విడతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్