నిత్యం భక్తులతో రద్దీగా వుండే… శ్రీశైలం దేవస్థానం పలు విభాగాలలో ఐ.ఎస్.ఓ ధృవీకరణలు పొందింది. ఏడు విభాగాలలో ఈ ధృవీకరణలు లభించాయి. గతంలో జారీ చేసిన ధృవీకరణల కాలపరిమితి ముగియడంతో మళ్ళీ తిరిగి హెచ్.వై.ఎం ధృవీకరణ సంస్థ ప్రతినిధుల బృందం దేవస్థానం ఆయా కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించి ధృవీకరణలు ఇవ్వగా వీటిని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి,శ్రీశైలం శిల్పా చక్రపాణిరెడ్డి చేతుల మీదుగా ఆలయ చైర్మన్,ఈవో.లవన్నకు అందజేశారు.
Read Also: Bhakthi Tv Friday Stothra parayanam Live: నాల్గవ శ్రావణ శుక్రవారం స్తోత్రపారాయణం చేస్తే…
దేవస్థాన పరిపాలన విధి విధానాలు, పర్యావరణ పరిరక్షణకు అన్నదానం,ప్రసాదాల తయారీలో నాణ్యత,ఎల్.ఈ.డి దీపాల వాడకం, సౌరశక్తిలాంటి ఇంధనవనరుల వినియోగం,అధునాతన సీ.సీ కంట్రోల్,సాఫ్ట్ వేర్ టెక్నాలజీ వినియోగానికి,భక్తులు,స్థానికుల సౌకర్యార్థమై వైద్యపరంగా ముందస్తు చర్యలు, క్షేత్రములో పారిశుద్ధ్య నిర్వహణకు గాను ధృవీకరణను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ దేవస్థానం ఈవో లవన్న,సిబ్బంది మెరుగైన పనీతిరుతోనే ఐ.ఎస్.ఓ సాదించగలిగిందని ఉద్యోగులను కొనియాడారు.
అంతకుముందు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారిని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి,నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి,ఎంపీ పోచ బ్రహ్మానందం రెడ్డికి ఆలయం మర్యాదలతో అర్చకులు,ఆలయ చైర్మన్ ఈవో స్వాగతం పలికారు. అర్చక స్వాములు ఎమ్మెల్యే ఎంపీ నుదుటిన విభూది దిద్ది సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ ధ్వజస్థంభానికి నమస్కరించి అనంతరం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు ఎమ్మెల్యే శిల్పాకు,ఎంపీకి స్వామి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దర్శనార్థం ఆలయంలో వెలుపలకు వెళ్లిన ఎమ్మెల్యే భక్తులు దర్శనానికి వచ్చేనప్పుడు ఎండకు పాదాలు కాలకుండా చలువ మ్యాట్ లు త్వరగా వేయించాలని ఆలయ ఛైర్మన్ కు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి సూచించారు.
Read Also: Mahesh Babu: టాలీవుడ్ లో మరో పెద్ద మల్టీస్టారర్.. నాగార్జునతో మహేష్ బాబు