నేడు ఏపీ వ్యాప్తంగా నిరసనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు సిద్ధమయ్యాయి.
ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరణకు తెలంగాణలో నేటితో గడువు ముగియనుంది. క్రమబద్ధీకరణ కోసం ఇప్పటివరకు 1.47 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
శ్రీశైలంలో రెండోరోజు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. సాయంత్రం మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనుంది. కైలాసవాహనంపై ఆశీనులై ఆది దంపతులు ప్రత్యేక పూజలందుకోనున్నారు.
నేడు భారత్‌కు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ రానున్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులపై ఇరు దేశాలు చర్చించే అవకాశం ఉంది.
నేడు 72 మంది రాజ్యసభ ఎంపీలకు వీడ్కోలు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో జీరోఅవర్, ప్రశోత్తరాలు రద్దు చేశారు.
నేటి నుంచి తెలంగాణలో స్కూళ్ల సమయాల్లో మార్పులు జరుగనున్నాయి. వేసవికాలం ఎండతీవ్రత అధికంగా ఉండడంతో, పాఠశాల సమయాన్ని కుందిస్తున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ వెల్లడించింది.