Sri lanka: ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ద్వీపదేశం శ్రీలంక, ఇప్పుడు కరెంట్ కష్టాలను ఎదుర్కొంటోంది. విద్యత్ సిస్టమ్ వైఫల్యం కారణంగా దేశవ్యాప్తంగా కరెంట్ లేకుండా పోయింది. శ్రీలంక మొత్తం అంధకారంలో ఉంది.
Gotabaya Rajapaksa Returns To Srilanka: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స స్వదేశానికి తిరిగి వచ్చారు. దాదాపుగా 50 రోజులకు పైగా ప్రవాసంలో గడిపిన ఆయన స్వదేశం శ్రీలంకలో అడుగుపెట్టారు. రాజపక్స శుక్రవారం అర్థరాత్రి థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి సింగపూర్ మీదుగా కొలంబోలోని బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. రాజపక్స పార్టీ మద్దతుదారులు, నాయకులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. భారీ సైనిక కాన్వాయ్ భద్రతలో కొలంబోలోని అతనికి కేటాయించిన ఇంటికి…
Sri Lankan children suffering from hunger: శ్రీలంక దేశ ఆర్థిక కష్టాలు ఇప్పటికిప్పుడే తీరేలా లేవు. గత మార్చి నుంచి శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారింది. నిత్యవసరాల ధరలు అమాంతం పెరిగాయి. పెట్రోల్, డిజిల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. పనులు లేక మహిళలు వ్యభిచారులుగా మారుతున్న దయనీయ పరిస్థితులు శ్రీలంకలో చూస్తున్నాం. శ్రీలంక ఖజానాలో విదేశీమారక నిల్వలు అడుగంటుకుపోయాయి. ఇతర దేశాల నుంచి నిత్యావసరాలను తెప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. తమను ఆదుకోవాలని ఐఎంఎఫ్ ను…
Sri Lanka government granted permission for Chinese research vessel: శ్రీలంక బుద్ధి మారలేదు. తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న దేశానికి ఏ దేశం కూడా అప్పు ఇవ్వని స్థితిలో భారత్ ఆదుకుంది. అయినా శ్రీలంకకు విశ్వాసం లేదు. గతంలో లాగే భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. మళ్లీ చైనాతో అంటకాగుతోంది. శ్రీలంక ఆర్థిక దుర్భర పరిస్థితికి కారణమైనా చైనానే ముద్దంటోంది. చైనా సర్వే, పరిశోధన నౌక యువాన్ వాంగ్ 5కు శ్రీలంక తన…
Gotabaya Rajapaksa To Seek Temporary Stay In Thailand: శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం అయిన మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స మరో దేశం ఆశ్రయం కోరాడు. గత నెలలో శ్రీలంక వ్యాప్తంగా ప్రజానిరసనలు మిన్నంటాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న గోటబయ రాజపక్స శ్రీలంకను వదిలి ఆర్మీ విమానంలో మాల్దీవులకు పారిపోయాడు. అయితే అక్కడ కూడా శ్రీలంక ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో జూలై 14న సింగపూర్ దేశానికి పారిపోయాడు. అప్పటి నుంచి…
తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజాగ్రహానికి గురైంది అక్కడి ప్రభుత్వం. కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం వల్ల అధ్యక్షుడు విదేశాలకు పారిపోయాడు. మళ్లీ అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నిరసనలు మొదలైన నాలుగు నెలల తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం అధ్యక్ష కార్యాలయానికి సమీపంలో ఉన్న తమ నిరసన క్యాంపును ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.
Sri Lanka To Raise Electricity Rates: శ్రీలంక ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఇప్పటికే కరెంట్ కోతలతో అల్లాడుతున్న జనానికి మరో షాక్ ఇచ్చింది శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డ్(సీఈబీ). తన నష్టాలను పూడ్చుకునేందుకు ప్రజలపై భారాన్ని మోపింది. ఏకంగా 264 శాతం ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు మరింత భారాన్ని మోయాల్సిన పరస్థితి ఏర్పడింది. 616 మిలియన్ డాలర్ల మేర పేరుకుపోయిన బకాయిల నుంచి బయటపడేందుకు…
India objected to China's Yuan Wang 5 ship: భారత్ ఒత్తడికి శ్రీలంక తలొగ్గింది. శ్రీలంక హంబన్ టోటా నౌకాశ్రయానికి అత్యాధునికి చైనా నౌక ‘యువాన్ వాంగ్ 5’ రావడాన్ని భారత్ తీవ్రంగా నిరసిస్తోంది. ముఖ్యంగా శాటిలైట్ ట్రాకింగ్ పరిశోధన నౌక యువాన్ వాంగ్ 5 ఆగస్టు 11 నుంచి 17 వరకు హంబన్ టోట పోర్టులో ఉండాల్సి ఉంది. అయితే ఈ నిఘా నౌక భారత్ పై కూడా నిఘా పెడుతుందని మన దేశం…
Sri Lankan President thanks PM Modi: గత కొంత కాలంగా చైనాతో రాసుకుపూసుకు తిరిగిన శ్రీలంకకు భారత్ విలువ తెలుస్తోంది. రాజపక్సల హయాంలో భారత్ ను కాదని.. చైనాతో వ్యాపారం చేసి, భారీగా అప్పులు చేసిన శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోెభాన్ని ఎదుర్కొంటోంది. చైనా అప్పులు తీర్చలేక హంబన్ టోటా నౌకాశ్రయాన్ని 99 ఏళ్లకు లీజుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ కు ఇస్తామన్న ప్రాజెక్టులను కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసిన చరిత్ర రాజపక్సలది.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పని దొరకకపోవడంతో పాటు తినడానికి తిండి కూడా దొరకక యువకులు నేరాలకు పాల్పడుతున్నారు. లంకలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం లంకలోని యువత దొంగలుగా మారుతున్నారు.