India objected to China’s Yuan Wang 5 ship: భారత్ ఒత్తడికి శ్రీలంక తలొగ్గింది. శ్రీలంక హంబన్ టోటా నౌకాశ్రయానికి అత్యాధునికి చైనా నౌక ‘యువాన్ వాంగ్ 5’ రావడాన్ని భారత్ తీవ్రంగా నిరసిస్తోంది. ముఖ్యంగా శాటిలైట్ ట్రాకింగ్ పరిశోధన నౌక యువాన్ వాంగ్ 5 ఆగస్టు 11 నుంచి 17 వరకు హంబన్ టోట పోర్టులో ఉండాల్సి ఉంది. అయితే ఈ నిఘా నౌక భారత్ పై కూడా నిఘా పెడుతుందని మన దేశం ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ మహాసముద్రంలో చౌనా పరిశోధన నౌక తిరగడాన్ని భారత్ తీవ్రంగా భావిస్తోంది. అయితే శ్రీలంక నౌక రావడాన్ని వాయిదా వేయాలని చైనాకు సూచించింది. హంబన్ టోటా రేవును 99 ఏళ్ల లీజుకు చైనా తీసుకుంది. దీన్ని సైనికపరంగా చైనా ఉపయోగించుకుంటుందని భారత్ కలవరపడుతోంది.
ఇదిలా ఉంటే ఆగస్టు 5న శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాక యువాన్ వాంగ్ 5 నౌక రావడాన్ని నిలిపివేయాలని కోరుతూ.. చైనా రాయబార కార్యాలయానికి లేఖ రాసింది. అయితే ఈ సమస్యపై చర్చిండానికి చైనా శ్రీలంకలో అత్యవసర సమావేశాన్ని కోరింది. శ్రీలంక ఆర్థిక సంక్షోభం సమయంలో జూలై 12న అప్పటి శ్రీలంక ప్రభుత్వం, చైనా నౌక రావడాన్ని ఆమోదించింది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు హిందూ మహాసముద్ర వాయువ్య భాగంలో ఉపగ్రహ నియంత్రణ, పరిశోధన ట్రాకింగ్ కోసం ఈ నౌకను చైనా పంపింది.
Read Also: Taapsee Pannu: నా శృంగార జీవితం అలా లేదు.. అందుకే!
ఈ నౌక ద్వారా ఉపగ్రహాలు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ట్రాక్ చేసే సామర్థ్యం ఉన్నందువల్ల భారత్ నిరసన తెలిపింది. ఈ నౌక శ్రీలంకకు వెళ్లే క్రమంలో భారత్ కార్యకలాపాలపై నిఘా పెట్టే అవకాశం ఉంది. దీంతో భారత్ తన ఆందోళనలను శ్రీలంకకు వ్యక్త పరిచింది. గతంలో రాజపక్స హయాంలో 2014లో చైనా అణు జలంతర్గామికి శ్రీలంక అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి శ్రీలంక, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. శ్రీలంకకు ప్రధాన రుణదాతగా ఉన్న చైనా.. రుణాల ఊబిలో శ్రీలంకను ఇరికించి హంబన్ టోటా పోర్టును 99 ఏళ్లకు లీజుకు తీసుకుంది.
అయితే ఇటీవల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు కేవలం భారత్ మాత్రమే సహాయం అందించింది. రుణాలు ఇచ్చిన చైనా మాత్రం శ్రీలంకను పట్టించుకోలేదు. దాదాపుగా 4 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని భారత్, శ్రీలంకకు అందించింది. ప్రస్తుతం భారత్ ను కాదంటే మళ్లీ శ్రీలంక పరిస్థితి మారే అవకాశం ఉంది. దీంతోనే ప్రస్తుతం రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం చైనా యువాన్ వాంగ్-5 నౌక రావడానికి నో చెప్పింది.