Srilanka Economic Crisis: మోదీ నాయకత్వంలోని భారత్ మాకు ప్రాణం పోసింది.. శ్రీలంక అధ్యక్షుడి కృతజ్ఞతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lankan President thanks PM Modi: గత కొంత కాలంగా చైనాతో రాసుకుపూసుకు తిరిగిన శ్రీలంకకు భారత్ విలువ తెలుస్తోంది. రాజపక్సల హయాంలో భారత్ ను కాదని.. చైనాతో వ్యాపారం చేసి, భారీగా అప్పులు చేసిన శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోెభాన్ని ఎదుర్కొంటోంది. చైనా అప్పులు తీర్చలేక హంబన్ టోటా నౌకాశ్రయాన్ని 99 ఏళ్లకు లీజుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ కు ఇస్తామన్న ప్రాజెక్టులను కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసిన చరిత్ర రాజపక్సలది. అయితే సంక్షోభం సమయంలో చైనా కనీసం శ్రీలంకను పట్టించుకోలేదు. అసలు కష్టకాలంలో ఏ దేశం చేయని విధంగా పొరుగు శ్రీలంకకు భారత్ అన్ని విధాల సహయం చేసింది.
భారత్ చేసిన సాయాన్ని కొనియాడారు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే. భారత్ అందించిన ఆర్థిక సహాయాన్ని శ్రీలంకకు ‘ జీవన శ్వాస’గా అభివర్ణించారు. భారతదేశానికి, ప్రధాని నరేంద్ర మోదీకి రణిల్ విక్రమసింఘే బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ప్రారంభం అయిన శ్రీలంక పార్లమెంట్ సమావేశాల్లో ప్రజాప్రతినిధుల ముందు ఈ వ్యాఖ్యలు చేశారు అధ్యక్షుడు. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం మాకు ప్రాణం పోసింది. శ్రీలంక ఆర్థిక పునరుద్దరణ కోసం భారత్ ఎంతో సహకరించిందని ఆయన అన్నారు. నాదేశం, నా ప్రజల తరుపున భారత్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. రణిల్ విక్రమ సింఘే అధ్యక్షుడు అయిన తర్వాత, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. శ్రీలంక ఆర్థిక పునరుద్ధరణకు, స్థిరత్వానికి భారత్ సహకరిస్తుందని అన్నారు.
Also Read
Read Also: indian Medical Student in Philipines: ఫిలిప్పీన్స్ లో భారతీయ వైద్య విద్యార్థి కష్టాలు
ఇదిలా ఉంటే శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రజలు తీవ్ర ఆందోళనతో మాల్దీవులు, అక్కడ నుంచి సింగపూర్ పారిపోయాడు. దీంతో కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘేను ఎన్నుకున్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు దాదాపుగా 4 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించింది భారత్. ఇదిలా ఉంటే శ్రీలంక ప్రజలు అవసరాలను తీర్చేందుకు రానున్న ఆరు నెలల్లో 5 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయని అంచానా. ఐఎంఎఫ్ ఆర్థిక ప్యాకేజీని శ్రీలంక కోరుతోంది. 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత ఇలాంటి ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవడం శ్రీలంకకు ఇదే తొలిసారి.
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!