Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- ఇజ్రాయెల్‌పై కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్
- ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం
- సర్వత్రా ఉత్కంఠ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్‌పై దాడి చేయబోమని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. కాల్పుల విరమణ వెల్లడించింది. అయితే ఇరాన్ ప్రకటనపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు స్పందించలేదు. దాడులను ఆపాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరుదేశాలను కోరారు. కొద్దిసేపటికే ఇజ్రాయెల్‌పై దాడులను నిలిపివేసిందని ఇరాన్ మీడియా నివేదించింది. తమ ప్రతీకారం పూర్తయిందని.. అయితే లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ఇజ్రాయెల్‌ను ఇరాన్ సైన్యం హెచ్చరించింది. అయితే ఇరాన్ ప్రకటనపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ స్పందించలేదు.
ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేయగా.. ప్రతిగా ఇజ్రాయెల్ ఇరాన్‌లోని పలు సైనిక లక్ష్యాలపై దాడులు చేసింది. దక్షిణ బీరూట్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసిన నేపథ్యంలోనే టెహ్రాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ఇలా ఇరు దేశాలు ప్రతీకార దాడులు చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. దాడులు ఆపుతుందా? లేదా అనేది ఇంకా తెలియలేదు.
Also Read
తాజా పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. యుద్ధం తిరిగి ముదిరే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధి మార్గంలో రవాణా అంతరాయాలు కొనసాగుతుండటంతో ఇంధనం, వస్తువుల సరఫరాపై ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇరాన్ ప్రకటించిన కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుంది? ఇజ్రాయెల్ స్పందన ఎలా ఉంటుంది? అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజావార్తలు
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!