Srilkana: తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజాగ్రహానికి గురైంది అక్కడి ప్రభుత్వం. కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం వల్ల అధ్యక్షుడు విదేశాలకు పారిపోయాడు. మళ్లీ అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నిరసనలు మొదలైన నాలుగు నెలల తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం అధ్యక్ష కార్యాలయానికి సమీపంలో ఉన్న తమ నిరసన క్యాంపును ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. యూనివర్శిటీ విద్యార్థులు, వామపక్ష పార్టీల నేతృత్వంలోని బృందం రాజధానిలోని గాల్ ఫేస్ సముద్రతీర ప్రామినేడ్‌లో తమ గుడారాలను తొలగిస్తున్నట్లు తెలిపారు.స్థానిక హోటళ్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, టెంట్లను తొలగించాలని పోలీసులు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలు చేసిన 4 పిటిషన్లను సైతం ఉపసంహరించుకుంటున్నట్లు నిరసనకారుల ప్రతినిధి తెలిపారు. కార్యకర్తలు తమ టెంట్లను తొలగించడం, వారు వేసిన ఇతర నిర్మాణాలను తొలగించడం వంటి వీడియోలు బయటకు వచ్చాయి.
PM Narendra Modi: చేతబడిని నమ్మేవారు ప్రజల విశ్వాసాన్ని పొందలేరు.. కాంగ్రెస్‌పై ప్రధాని విమర్శలు
శ్రీలంక యొక్క అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభంలో ఇంధనం, ఆహారం, మందులు వంటి నిత్యావసరాల కొరతకు నిరసనగా ఏప్రిల్ 9న ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. జూలై 9న పదివేల మంది కొలంబోలోకి ప్రవేశించి గొటబాయ రాజపక్స అధ్యక్ష భవనాన్ని ఆక్రమించడంతో ఆయన పారిపోయి చివరికి రాజీనామా చేయవలసి వచ్చింది. రాజపక్స సింగపూర్‌కు పారిపోయి తన రాజీనామాను ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత, ప్యాలెస్‌తో పాటు ప్రధానమంత్రి ఇల్లు, కార్యాలయాన్ని ఆక్రమించిన నిరసనకారులను సైనికులు తరిమికొట్టారు. పోలీసుల దాడుల్లో సుమారు 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఆందోళనకారులు అరెస్టయ్యారు. అంతర్జాతీయంగా వచ్చిన వ్యతిరేకతతో వాణిజ్యం సంఘం అగ్రనేత జోసెఫ్ స్టాలిన్‌ను గత సోమవారం విడుదల చేశారు. మరోవైపు.. గొటబాయ రాజపక్స వారసుడిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు రణీల్ విక్రమ సింఘే. దేశంలో మళ్లీ నిరసనలు జరగకుండా అత్యవసర పరిస్థితి విధించారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరసనకారులు అధ్యక్ష భవనాన్ని ఆక్రమించిన వెంటనే వారు స్విమ్మింగ్ పూల్‌లో ఉల్లాసంగా ఈతలు కొడుతూ.. ఆ భవనంలోని బెడ్లపై పడుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో పాటు నిరసనకారులకు ఒక గదిలో దొరికిన 17.5 మిలియన్ రూపాయల ($46,000) నగదును అధికారులకు అప్పగించారు.