శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం మరింతగా ముదురుతూ.. ప్రజల ఇబ్బందులను పెంచుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి శ్రీలంక ప్రజలు ఎప్పుడూ చూడని అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు ఆపన్నహస్తం అందించి అండగా నిలుస్తోంది భారత్. ప్రస్తుత సంక్షోభ సమయంలో భారత్తో మళ్లీ స్నేహ సంబంధాలకు హస్తం చాచింది కొలంబో. సంక్షోభంలో చిక్కుకున్న పొరుగుదేశమైన శ్రీలంకకు భారత్ సోమవారం 21,000 టన్నుల ఎరువులను అందజేసింది.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పని దొరకకపోవడంతో పాటు తినడానికి తిండి కూడా దొరకక యువకులు నేరాలకు పాల్పడుతున్నారు. లంకలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం లంకలోని యువత దొంగలుగా మారుతున్నారు.
ద్వీప దేశం శ్రీలంకలో మళ్లీ అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. 8వ అధ్యక్షుడిగా విక్రమసింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు. మొత్తం 219 ఓట్లకు గాను 134 ఓట్లను సాధించి ఆయన విజయం సాధించారు. బుధవారం జరిగిన పార్లమెంటరీ ఓటింగ్‌లో 134 ఓట్లతో ప్రత్యర్థి డల్లాస్ అలహప్పెరుమాపై గెలుపొందారు.
తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని గట్టున పడేసే నాయకుడి ద్వీపదేశం శ్రీలంక ఎదురుచూస్తోంది. ఇవాళ శ్రీలంకలో కొత్త నాయకత్వం కొలువుదీరబోతోంది. ఆ దేశ తదుపరి అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా అంత సులభమేమీ కాదు. గత వారం అధ్యక్షభవనంపై నిరసనకారులు దాడి చేయడంతో విదేశాలకు పారిపోయిన గొటబాయ రాజపక్సే స్థానంలో అధ్యక్షుడిని నియమించాలని శ్రీలంక పార్లమెంట్ నిర్ణయించింది.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ కొనాలంటే గగనంగా మారిపోయింది.. పెట్రోల్ బంక్‌కు వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియని పరిస్థితి.. అక్కడి వరకు వెళ్తే దొరుకుతుందన గ్యారంటీ లేదు.. ఇక, బ్లాక్ అయితే.. ఏకంగా రూ.2500కు పెట్రోల్ అమ్ముతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇక, రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. కొలంబోలో ఉన్న ఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ మార్కెట్ (FOSE మార్కెట్)లో కిలో టమోటాలు రూ.150కి విక్రయిస్తున్నారు.…