ద్వీప దేశం శ్రీలంకలో మళ్లీ అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు మూడు నెలలకు పైగా శాంతియుతంగా ఆందోళన చేసిన కొలంబోలోని గాల్ ఫేస్‌పై శుక్రవారం తెల్లవారుజామున పోలీసులతో పాటు భారీ సైనిక బృందం దాడి చేసింది. పలువురు నిరసనకారులపై సైనికులు దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాలే ఫేస్ వద్ద ఉన్న ఉద్యమ శిబిరాన్ని ఖాళీ చేయించడానికి సిద్ధమైంది ఆర్మీ.. వంద రోజులుగా పాత పార్లమెంటు భవనం పక్కనే గూడారాలు వేసుకుని పోరాటం చేస్తున్నారు ఆందోళనకారులు.. ఘటనా స్థలానికి వేలాది మంది సైనికులు చేరుకున్నారు.. అయితే, ఈ దృశ్యాలను వీడియో తీస్తున్న బీబీసీ జర్నలిస్టు సహా పలువురిపై పోలీసులు దాడి చేశారు.. ఫోన్లు పగలగొట్టి, బలవంతంగా అక్కడ నుండి పంపించేశారు పోలీసులు.. గాల్లా ఫేస్ రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసింది లంక ఆర్మీ.. గాలే ఫెస్ సమీపంలో రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేశారు.. సమీప ప్రాంతానికి మీడియా, లాయర్లుకు కూడా అనుమతి నిరాకరించారు.. మరోవైపు.. ఆందోళనకారులు, ఆర్మీ మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.. గూడారాల కూల్చివేతను అడ్డుకున్న ఆందోళకారులపై ఆర్మీ దాడికి పాల్పడింది.
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. జులై 9న మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే శ్రీలంక నుండి పారిపోవడానికి దారితీసిన నాటకీయ పరిణామాల తర్వాత ద్వీపంలో రాజకీయ గందరగోళం మధ్య. తాత్కాలిక ప్రెసిడెంట్ విక్రమసింఘే సోమవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు, అతను అధ్యక్షుడిగా ఎన్నికైన కీలకమైన పార్లమెంటు ఓటింగ్‌కు రెండు రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, శుక్రవారం మధ్యాహ్నానికి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తామని ఆందోళనకారులు ప్రకటించినందున, శుక్రవారం తెల్లవారుజామున నిరసన ప్రదేశాన్ని సైన్యం దూకుడుగా స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది.. కొంతమంది న్యాయవాదులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు..
ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న ప్రకారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సైనికులు ఆ ప్రాంతాన్ని ముట్టడించారు.. ఆందోళన ప్రదేశంలో ఉంచిన నిరసనకారుల గుడారాలను కూల్చివేశారు. వారు చాలా మంది నిరసనకారులపై దాడి చేశారు, ముఖ్యంగా పరిణామాలను చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్న వారిపై కూడా దాడి చేశారు. పోలీసులు లేదా సైన్యం ప్రవేశాన్ని అడ్డుకోవడంతో ఇతర యాక్సెస్ రోడ్ల ద్వారా సంఘటనా స్థలానికి చేరుకోవడానికి మీడియా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మీడియాను ఎందుకు అనుమతించరని అడిగినప్పుడు.. ఎవరూ వెళ్లలేరు. అంతేనని ఓ పోలీసు అధికారి సమాధానం ఇచ్చారు.. మొత్తంగా కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. శ్రీలంకలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపేలా చర్యలకు పూనుకుంటుంది అక్కడి ప్రభుత్వం.. మరి. ఆందోళనలు చల్లారుతాయా? ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన లంక.. గాడిలోపడడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.