Srilanka: శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం మరింతగా ముదురుతూ.. ప్రజల ఇబ్బందులను పెంచుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి శ్రీలంక ప్రజలు ఎప్పుడూ చూడని అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే దేశంలో పట్టణ పేదరికం గత సంవత్సరంలో మూడు రెట్లు పెరిగిందనీ ప్రపంచ బ్యాంకు నివేదిక కూడా పేర్కొంది. చేతిలో చిల్లిగవ్వ లేదు.. శ్రీలంకలో ఎటు చూసినా దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి నిస్సహాయ స్థితిలో లంక మహిళలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను చవిచూసిన ళ శ్రీలంకకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్వదేశం నుంచి పారిపోయి శనివారం తమిళనాడులోని ధనుష్కోడికి చేరుకుంది.
శ్రీలంకలో సంక్షోభం నుండి తప్పించుకోవడానికి ఒక మహిళ ఇల్లు అమ్మి, తమిళనాడుకు చేరుకుంది. శ్రీలంక మహిళ తన ఇంటితో సహా తన వస్తువులన్నింటినీ విక్రయించి, సంక్షోభంలో ఉన్న దేశం నుండి పారిపోయి శనివారం తమిళనాడు ఒడ్డుకు చేరుకుంది. ఆస్తులు అమ్మి వచ్చిన డబ్బును భారత్ పర్యటనకు వినియోగించింది. ఓ పడవలో ధనుష్కోడికి తన ఇద్దరు పిల్లలతో కలి వచ్చింది. అక్రమంగా భారత జలాల్లోకి వచ్చిన పడవలో వచ్చిన కారణంగా ప్రాదేశిక జలాల పర్యవేక్షణలో ఉన్న మెరైన్ పోలీసులు ముగ్గురిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.
Isro LVM3: కొన్ని గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనున్న బాహుబలి రాకెట్ ఎల్వీఎం3..
శాంతి అనే మహిళ శ్రీలంకలోని జాఫ్నా నివాసి అని ప్రాథమిక విచారణలో తేలింది. ఆమె నిన్న రాత్రి 10 గంటల సమయంలో తలైమన్నార్ నుంచి ఫైబర్ బోట్ ఎక్కి ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో ధనుష్కోడి చేరుకుంది. రెండేళ్ల క్రితం నా భర్త చనిపోవడంతో పిల్లలిద్దరినీ నేనే చూసుకుంటున్నా.. ఇంటి పని చేస్తే వచ్చ డబ్బులు బతకడానికి సరిపోవడం లేదని.. చాలా రోజులుగా ఒక్క పూట భోజనం చేసేవాళ్లమని శాంతి తన బాధను వివరించింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యలో ఆ దేశంలోని ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపింది. తాము ఇక్కడికి బతుకుదెరువు కోసం వచ్చినట్లు విన్నవించింది.