Srilanka: దారుణంగా శ్రీలంక పరిస్థితి.. తిండిలేక ఒళ్లు అమ్ముకుంటున్న మహిళలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srilanka: శ్రీలంక దేశం పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవుతోంది. గత నాలుగు నెలలు నుంచి శ్రీలంక ఆర్థిక సంక్షోభం తో కొట్టుమిట్టాడుతోంది. తినడానికి తిండిలేక, చేయడానికి ఉద్యోగం లేక శ్రీలంక ప్రజలు అల్లాడుతున్నారు. కరోనా కాలంలోనే ఈ పరిస్థితి మొదలవ్వగా ప్రస్తుతం ఈ దేశ పరిస్థితి చేయి దాటిపోయింది. ఇక దేశాధ్యక్షుడు గొటబాయ ప్రజలను గాలికి వదిలేసి రాజపక్ష దేశం వదిలి సింగపూర్ పారిపోయాడు. పట్టించుకొనేవారు లేరు, తిండి పెట్టే దిక్కులేక ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమలో పనిచేసే మహిళలు.. ఎక్కడ తమ ఉద్యోగం పోతుందో, పిల్లలకు తిండి పెట్టలేమని ఆలోచించి వ్యభిచారంలోకి దిగుతున్నారట.. గడిచిన నాలుగు నెలల్లో వ్యభిచార వృత్తిలో దిగినవారి సంఖ్య 30%శాతానికి చేరిందని అంచనా. నిజం చెప్పాలంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఏది ఉండదని అంటున్నారు. కడుపు నింపుకోవడానికి ఒళ్లు అమ్ముకుంటున్నారని, చిన్నారులను రక్షించుకోవడానికి ఇంతకంటే మరో మార్గం లేదని వారు భావిస్తున్నారట.
శ్రీలంక రాజధాని నగరం కొలంబో ప్రాంతంలో ఈ ఏడాది జనవరి నుంచి ‘ఆయుర్వేద స్పా’ల ముసుగులో వ్యభిచార గృహాలు పుట్టుకొచ్చాయని టాక్ నడుస్తోంది. ఇక బలవంతంగా పడక వృత్తి చేస్తున్నా.. తమకు డబ్బులు బాగానే వస్తున్నాయని, అంతకు ముందు నెలకు వచ్చే జీతం.. ఇప్పుడు రోజుకే వస్తుందని మహిళలు చెప్పుకొస్తున్నారు. గత్యంతరం లేక ఈ పనిలో దిగామని తెలుపుతున్నారు. ఇంట్లో ఆహారం, మందులు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయని, వాటిని కొనలేని స్థితిలో ఉన్నామని, ఈ వ్యభిచారం తమకు తిండి పెడుతుందని, ఇష్టం లేకపోయినా వ్యాపారులకు తమ శరీరాలను అప్పగిస్తున్నట్లు చెప్పుకొస్తున్న వారి కథలు విన్నవారి గుండెలు బద్దలు అవ్వక మానడం లేదు అని అంటున్నారు. మరి ఈ పరిస్థితి ఎప్పటివరకు ఉంటుంది.. శ్రీలంక ఆర్థిక సంక్షోభం ఎప్పుడు చక్కబడుతోంది అనేది ఆ దేవుడికే తెలియాలి అంటున్నారు ఈ విషాదాన్ని విన్నవారు.
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
తాజావార్తలు
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!