ప్రపంచీకరణ తర్వాత యువకుల్లో కెరీరిజం పెరిగింది. ధర్నాలు, ఆందోళనలు తగ్గిపోయాయి. రాజకీయ భావజాలం అంతరించిపోతోంది. ఇది చాలా మంది అభిప్రాయం. అయితే ఇది పూర్తిగా నిజం కాదని శ్రీలంక నిరూపించింది. పాలకులంతా శ్రీలంక నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే.. ప్రజలు మంచి వాళ్లే. అయితే అతి పేదరికం ఆకలిలోకి నెడితే మాత్రం వెంటపడి తరుముతారు. శ్రీలంకలో జరుగుతున్నది ఇదే. దీనికి పరిష్కారం కూడా అంత సులభం కాదు. కొత్తగా ఎవరొచ్చినా చేయగలిగింది ఏమీ లేదు. అప్పులిచ్చిన సంస్థలన్నీ…
శ్రీలంక సంక్షోభం మరింతగా ముదురుతోంది. ఒక్కొక్కరుగా నాయకులు రాజీనామాలు చేస్తున్నప్పటికీ.. ప్రజల ఆందోళనలు, నిరసనలు ఏమాత్రం తగ్గడం లేదు. నిరసనకారులు నేతల ఇళ్లను, వారికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేస్తూ.. ఆందోళనలు చేస్తున్న క్రమంలోనే ఇప్పటికే అనేక మంది నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. శ్రీలంక అధ్యక్షుడి సోదరుడు విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నించాడు. దీనిని ముందుగానే గుర్తించిన విమానాశ్రయ అధికారులు, ప్రయాణికులు ఆయనను అడ్డుకున్నారు. ఈ నెల 13న అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేస్తారనీ.. ఆ తర్వాత అన్ని…
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తుతోంది. ఆందోళనలతో ద్వీపదేశం అట్టుడుకుతోంది. ఇప్పటికే ఆందోళనకు బయపడి దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స పారిపోయారు. రాజధాని కొలంబోలో అధ్యక్షభవనంతో పాటు సెక్రటేరియట్ను ముట్టడించారు నిరసనకారులు. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని పదవకి రణిల్ విక్రమసింఘే రాజీనామా చేశారు. శ్రీలంకలో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి చర్చించేందుక అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు రణిల్. ఈ సమావేశానికి అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించారు. ఈ…
శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో రెండు నెల క్రితం రోడ్లెక్కిన జనం.. ఆందోళనలు ఉధృతం చేశారు. నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. దీంతో ఎమర్జెన్సీ విధించిన శ్రీలంక ప్రభుత్వం.. తరువాత సడలించింది. మళ్లీ మే 6 నుంచి చేపట్టిన నిరనసలు విధ్వంసానికి దారి తీయడంతో.. రెండోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆ తరువాత మహింద రాజపక్స రాజీనామా చేయడం, కొత్త ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. ఇదే సమయంలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టడంతో……
లంకకు నిప్పంటుకుంది. దేశం రణరంగంగా మారింది. ఆర్థిక సంక్షోభాన్ని తాళలేక జనంలో నెలకు పైగా నెలకొన్న ఆగ్రహావేశాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారుల దాడితో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఆగ్రహించిన జనం దేశవ్యాప్తంగా రోడ్లపైకొచ్చారు. ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ మద్దతుదారులపై దాడులకు దిగారు. ఇప్పటిదాకా తమకు తిరుగులేదనుకున్న రాజకపక్సేలకు.. జనం పవరేంటో తెలిసొచ్చింది. శ్రీలంకలో కర్ఫ్యూ పెట్టినా.. ఎమర్జెన్సీ విధించినా నిరసనకారులు తగ్గడం లేదు. అధికార పార్టీ నేతల్ని వెంటపడి…
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఆందోళనలు ఉగ్రరూపం దాల్చడంతో.. లంక తగలబడిపోతోంది… ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలకు దారి తీసింది.. ఆగ్రహంతో ఊగిపోతోన్న ప్రజలు.. అధికార పార్టీకి చెందిన పలువురు రాజకీయ నాయకుల ఇళ్లకు నిప్పెపెట్టారు.. పలువురు మంత్రులు, ఎంపీల ఇళ్లకు సైతం నిప్పుపెట్టారు. సోమవారం ప్రధానమంత్రి పదవికి మహింద రాజపక్సే రాజీనామా చేశారు. దాంతో ఆయన మద్దతుదారులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై దాడి చేయంతో..…
తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక చేతులెత్తేసింది.. కష్టాల నుంచి బయటపడడానికి వరుసగా ధరలను పెంచేస్తోంది.. ఇప్పటికే అప్పులు కట్టడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ చేతులెత్తేసింది ఆ దేశ ప్రభుత్వం.. మరోసారి పెట్రో ధరలను పెంచింది.. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన, ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి.. పెట్రోలు, డీజల్ ధరలను మరింత పెంచింది శ్రీలంక ప్రభుత్వం.. తాజా పెంపుతో శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర 338 రూపాయలకు చేరగా.. లీటరు…
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితులు పొంచి ఉన్నాయనే వార్తలు లంక వాసులను కలవరపెడుతున్నాయి. నిత్యావసరాల కోసం షాపుల ముందు బారులు తీరారు. ఒక్క పాలపొడి ప్యాకెట్‌ను తీసుకునేందుకు గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు. లంకలో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. చమురు, గ్యాస్, ఔషధాలు, ఆహార కొరతతో పాటు విద్యుత్ కోతలు మరింత ఎక్కువయ్యాయి. ఇంధన ధరలు, నిత్యావసరాలు ఆకాశాన్ని తాకడంతో.. తినడానికి నానా అవస్థలు పడుతున్న జనం.. రాజపక్స…
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నెలకొంది.. రోజు రోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. దిగుమతులు చేసుకోలేని దుస్థితికి చేరుకోవడంతో కొలంబలో పేపర్ నిల్వలు అయిపోయాయి. దీంతో ప్రభుత్వం కనీసం విద్యార్థులకు పరీక్షలు కూడా నిర్వహించలేకపోతోంది. నేటి నుంచి జరగాల్సిన టర్మ్ పరీక్షలను నిరవధికంగా వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నా పత్రాల తయారీకి సరిపడా పేపర్, ఇంక్‌ను దిగుమతి చేసుకోవడానికి విదేశీ మారకద్రవ్యం లేని కారణంగా పరీక్షలను నిర్వహించలేకపోతున్నామని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో దేశంలోని మొత్తం 45…