నేడు వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. సోనియా, కాంగ్రెస్ పరువుకు భంగం కలిగించేలా సినిమాను చిత్రీకరించాలని పిటిషనర్ పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను పునఃపరిశీలించాలని కోరారు. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరంలో పర్యటించనున్నారు. ‘విద్యా దీవెన’కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి నేడు మలివిడత సీఎం జగన్‌తో…
నేడు కృష్ణా జిల్లాలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పర్యటించనున్నారు. పామర్రు బెల్ పరిశ్రమ పరిశీలన, జిల్లా కార్యవర్గ సమావేశంలో పురంధరేశ్వరి పాల్గొననున్నారు. నేడు అనకాపల్లి మండలం కూండ్రం గ్రామంలో వంగవీటి రంగా విగ్రహాంను విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించనున్నారు. అనంతరం గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత పర్యటించనున్నారు. ఉదయం 11:00 గంటలకు కొవ్వూరు టౌన్లో…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా దేశంలో క్రీడా కార్యకలాపాలకు అద్భుతమైన వాతావరణం ఏర్పడిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ క్రమంలో.. అంతర్జాతీయంగా క్రీడా రంగంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు.
కబడ్డీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 డిసెంబరు 2న ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని ట్రాన్స్‌స్టేడియాలోని ఏకా అరేనా గ్రౌండ్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ మ్యాచ్ లు 2024 ఫిబ్రవరి 21 వరకు జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. ప్లే ఆఫ్లకు సంబంధించి షెడ్యూల్ త్వరలోనే తెలపనున్నారు. మరోవైపు పో కబడ్డీ సీజన్ 10 కోసం తెలుగు టైటాన్స్ కొత్త జట్టును ప్రకటించింది.
భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో ఖతార్‌తో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ 2026 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 0-3 తేడాతో ఓడిపోయింది. సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత ఫుట్‌బాల్ జట్టు.. అంతకుముందు కువైట్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది.
ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్ మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీ డిసెంబర్ 2న ప్రారంభం కానుంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, తెలుగు టైటాన్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని 'ది అరేనా బై ట్రాన్స్‌స్టాడియా'లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో లీగ్ దశలో మొత్తం 12 జట్ల మధ్య 132 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రో కబడ్డీ సీజన్ 10.. డిసెంబర్ 2 నుంచి ప్రారంభమై వచ్చే ఏడాది…
వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అనంతపురం జిల్లాలో బెట్టింగురాయుళ్లపై ప్రత్యేక నిఘా విధించింది సైబర్‌సెల్. అనంతపురం పోలీస్ సైబర్ సెల్ ద్వారా సుమారు 70 బెట్టింగ్ ఆన్లైన్ యాప్‌లను గుర్తించారు. ఈ యాప్‌లను నిషేధించాలని సంబంధిత శాఖలకు జిల్లా ఎస్పీ సిఫారసు లేఖ రాశారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించమన్నారు.
వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. తొలి సెమీ ఫైనల్ ఇండియా-న్యూజిలాండ్ తలపడగా.. భారత్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక.. రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది.. ఫైనల్లో టీమిండియాతో తలపడనుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మెగా పోరు జరుగనుంది.
డ్రీమ్ స్పోర్ట్స్ యాజమాన్యంలోని ఫ్యాన్కోడ్ను భాగస్వామ్యం చేసిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో తన మొదటి స్పోర్ట్స్ ఛానెల్‌ని ప్రారంభించింది. ఇది క్రికెట్, ఫుట్‌బాల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 15కి పైగా క్రీడల ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తుంది. అమెజాన్ ఇంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన భారత క్రికెట్ మ్యాచ్‌లతో సహా ప్రత్యక్ష ప్రసార మ్యాచ్‌లను ప్రసారం చేసింది.