జూన్‌లో వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ జరగనుంది. అందులో టీమిండియాకు పెద్ద ముప్పుగా మారే జట్టును భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చెప్పాడు. 2024 ప్రపంచకప్ టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల కంటే అఫ్గానిస్థాన్ నుంచి టీమిండియాకే ఎక్కువ ముప్పు పొంచి ఉందని అన్నాడు. కాగా.. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ టైటిల్ గెలవడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా టైటిల్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోందని, అందుకే టీ20 ప్రపంచకప్‌పై భారత్ కన్నేసిందని గంభీర్ పేర్కొన్నాడు.
Read Also: Uttar Pradesh: యూపీలో అమానుషం.. కట్నం డబ్బులు తీసుకురాలేదని మహిళను వివస్త్రను చేశారు..
థంబ్‌సప్ ఈవెంట్‌లో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, “టీ 20 ప్రపంచ కప్‌లో భారతదేశానికి అతిపెద్ద ముప్పు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు. వారు చాలా ప్రమాదకరమైనదిగా చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ లో ఇంగ్లండ్ పై ఆడిన వారి ఆట తీరు చూస్తే.. ఆస్ట్రేలియా కంటే మెరుగ్గా కనిపిస్తున్నారని చెప్పాడు. ఈ క్రమంలో టీమిండియాను కూడా ఎదురించే సత్తా ఉంది. ముఖ్యంగా.. వారికి బౌలింగే బలమన్నాడు.
Read Also: New Year Wishes: తెలుగు ప్రజలకు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 2013 నుండి ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా గెలవని టీమిండియా.. టీ 20 ప్రపంచ కప్ 2024ని కొత్త సవాలుగా చూస్తోంది. ఐపీఎల్ 2024 తర్వాత ఈ టోర్నీ జరగనుంది. ఐపీఎల్ మే నెలాఖరులో ముగియనుండగా.. జూన్ నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈసారి టీ20 ప్రపంచ కప్ లో 20 జట్లు పాల్గొనబోతున్నాయి.