T20 World Cup: టీ20 ప్రపంచకప్ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఇప్పటికే మెగా టోర్నీ నుంచి వెస్టిండీస్ లాంటి టీమ్ ఇంటి బాట పట్టింది. ఇప్పుడు సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు పరాభవం ఎదురైంది. సూపర్-12లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ 89 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 201 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను 111 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఆస్ట్రేలియా పతనానికి…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో అసలు సిసలు పోరు ఈరోజే ప్రారంభమైంది. సూపర్-12లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 201 పరుగులు భారీ టార్గెట్ నిలిచింది. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే 92 పరుగులతో తుదికంటా…
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో శుక్రవారంతో క్వాలిఫయర్ మ్యాచ్‌లు ముగిశాయి. శనివారం నుంచి సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. క్వాలిఫయర్ మ్యాచ్‌ల నుంచి నాలుగు జట్లు సూపర్-12 దశకు అర్హత సాధించాయి. గ్రూప్-ఎ నుంచి శ్రీలంక, నెదర్లాండ్ అర్హత సాధించగా.. గ్రూప్-బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్ క్వాలిఫై అయ్యాయి. వెస్టిండీస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. గత ప్రపంచకప్‌లో ఆడిన నమీబియా, స్కాట్లాండ్ స్థానంలో ఈ వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్, జింబాబ్వే వచ్చాయి. సూపర్-12లో…
Virat Kohli: మైదానంలో అగ్రెసివ్‌గా ఉండే టీమిండియా క్రికెటర్లలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. అతడు ఎలాంటి భావోద్వేగాన్ని దాచుకోడు. సంతోషం వచ్చినా, కోపం వచ్చినా దానిని బయటపెట్టేస్తుంటాడు. అందుకే విరాట్‌ను చాలా మంది అభిమానులు ఇష్టపడుతుంటారు. అయితే టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా శుక్రవారం నాడు విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఈనెల 23న పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ సందర్భంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సమయంలో…
T20 World Cup: టీ20 క్రికెట్లో తోపుగాళ్లు ఎవరంటే ఎవరైనా వెస్టిండీస్ ఆటగాళ్ల పేర్లే చెప్తారు. పొలార్డ్, హోల్డర్, గేల్, లూయీస్, ఆండీ రసెల్, సునీల్ నరైన్, పూరన్, హిట్మెయిర్, బ్రావో.. ఇలా అందరూ హిట్టర్లే ఉన్న జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి అర్ధంతరంగా వైదొలుగుతుందని ఎవరైనా ఊహిస్తారా. కానీ అదే నిజమైంది. రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన ఆ జట్టుకు ఈ ప్రపంచకప్‌లో ఘోర అవమానం ఎదురైంది. గ్రూప్ దశలోనే పసికూనలను ఎదుర్కోలేక ఇంటి…
Chess Championship: ఇటలీ వేదికగా జరుగుతున్న ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు అమ్మాయికి చేదు అనుభవం ఎదురైంది. ఈ టోర్నీలో ఆడుతున్న విజయవాడ గ్రాండ్‌మాస్టర్ నూతక్కి ప్రియాంక టోర్నీ నుంచి బహిష్కరణకు గురైంది. ఈ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన ఆరో రౌండ్‌కు ప్రియాంక పొరపాటున తన జేబులో మొబైల్ ఇయర్ బడ్స్‌తో వచ్చింది. చెకింగ్‌లో ఆమె జాకెట్లో ఇయర్ బడ్స్ బయటపడటంతో ఆటను రద్దు చేసి ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. ఫౌల్ గేమ్ ఆడనప్పటికీ…
IPL 2023: కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఐపీఎల్ బోసిపోయింది. మ్యాచ్‌లన్నీ ఒకే చోట లేదా పరిమిత స్టేడియాలలో నిర్వహిస్తుండటం వల్ల ఐపీఎల్ కళ తప్పింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. 2023 సీజన్‌ను హోమ్ అండ్ అవే పద్ధతిలో నిర్వహించాలని కసరత్తులు చేస్తోంది. అంతేకాకుండా 2023 సీజన్ కోసం బీసీసీఐ మినీ వేలం ప్రక్రియను నిర్వహించబోతోంది. ఈ ఏడాది డిసెంబర్ 16న బెంగళూరు వేదికగా ఐపీఎల్ మినీ వేలం…
T20 World Cup: క్రికెట్ ప్రపంచంలో వెస్టిండీస్ జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ జట్టు నిండా హిట్టర్లే ఉంటారు. కానీ నిలకడలేమితో ఆ జట్టు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు దిగ్గజ జట్టుగా ప్రశంసలు పొందిన ఆ జట్టు నేడు ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్ జట్టు సగర్వంగా అందుకుంది. 2012, 2016లో పొట్టి ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచింది. తొలిసారి టీ20…
Aimchess Rapid tourney: చెస్ ఆటలో వరల్డ్ ఛాంపియన్, నార్వే ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల తన ప్రాభావ్యాన్ని కోల్పోతున్నాడు. తరచూ భారత్ గ్రాండ్ మాస్టర్ల చేతిలో ఓటమి పాలవుతున్నాడు. ఇటీవల 17 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద… మాగ్నస్ కార్ల్‌సన్‌ను నెలరోజుల వ్యవధిలో మూడుసార్లు ఓడించి చెస్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. తాజాగా మరో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగైసి కూడా మాగ్నస్ కార్ల్‌సన్‌ను చిత్తు చేశాడు. ఎయిమ్ చెస్ రాపిడ్ ఆన్…
T20 World Cup: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లోనే పసికూన నమీబియా సంచలనం నమోదు చేసింది. శ్రీలంకపై విజయం సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ప్రస్తుతం కరోనా కూడా మెగా టోర్నీకి గుబులు పుట్టిస్తోంది. కరోనా సోకిన ఆటగాడు దూరమైతే పలు జట్లు నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులోని ఆటగాడికి కరోనా వచ్చినా మ్యాచ్ ఆడటానికి అనుమతి ఇవ్వనుంది. టోర్నీ సమయంలో ఆటగాళ్లకు కోవిడ్ టెస్ట్…