Pele Death: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు పీలే కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pele Death: ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు పీలే (82) మృతిచెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సావో పాలోలోని ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పీలే బ్రెజిల్‌కు మూడుసార్లు ప్రపంచకప్ అందించారు. 1958, 1962, 1970లలో ఫిఫా ప్రపంచ కప్‌ను మూడుసార్లు గెలిపించిన ఏకైక ఆటగాడు పీలే. ఆయన బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 77 గోల్స్ చేశారు. మొత్తం 1,363 మ్యాచ్‌లలో 1,281 గోల్స్ చేశారు. 2000లో ప్లేయర్ ఆఫ్ ది సెంచరీగానూ ఎంపికయ్యారు.
Read Also: Heeraben Modi Passed away: నరేంద్రమోడీకి మాతృ వియోగం.. మోడీ తల్లి హీరాబెన్ మోడీ మృతి
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
పీలే గోల్ సగటు ప్రతి మ్యాచ్‌కు 0.94గా నమోదైంది. ఇది ఫుట్‌బాల్ ప్రపంచంలో ఇప్పటికీ అత్యుత్తమంగా ఉంది. కాగా పీలే మరణ వార్తను ఆయన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కుటుంబం ప్రకటించింది. పీలే మరణం ఫుట్‌బాల్ ప్రేమికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో అభిమానులు ఆయనకు చివరి వీడ్కోలు పలుకుతున్నారు. ఇటీవల ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమి పాలైనప్పటికీ.. మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసి ఫ్రెంచ్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు కైలియన్ ఎంబాప్పే ట్వీట్ చేసి అతనికి నివాళులర్పించాడు. మరణవార్త తెలుసుకున్న మెస్సీ కూడా పీలే మరణానికి సంతాపం తెలిపారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!