Ben Stokes: ఐసీసీపై బెన్ స్టోక్స్ ఆరోపణలు.. షెడ్యూల్‌పై శ్రద్ధ ఏదీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ben Stokes: ఐసీసీపై ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ సంచలన ఆరోపణలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ రూపకల్పనపై ఐసీసీ తగినంత శ్రద్ధ చూపడం లేదన్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ వన్డే సిరీస్ ఇందుకు అతి పెద్ద ఉదాహరణ అని.. ఎలాంటి ఉపయోగం లేని సిరీస్‌ను షెడ్యూల్ చేయడం ద్వారా ఎవరికైనా అర్ధమైందా అంటూ స్టోక్స్ ఆరోపించాడు. దేశవాళీ టీ20లకు ఆదరణ పెరుగుతుండటం టెస్ట్ ఫార్మాట్ అస్థిత్వాన్ని ప్రమాదంలోకి నెడుతుందని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్న విధానం తనకు నచ్చడం లేదన్నాడు.
Read Also: Anuraj Thakur: ఇంకా 1962లోనే ఉన్నారంటూ.. రాహుల్‌పై అనురాగ్ కౌంటర్
Also Read
- Ravi Shastri Commentary: 1994లో మొదలైన ప్రయాణం.. కామెంటరీలో తన గురువులెవరో వెల్లడించిన రవిశాస్త్రి!
- NZ vs IND 3rd ODI: హామిల్టన్‌లో వరుణుడి ఆట.. భారత్-న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు!
- Suresh Raina on Retirement: నన్ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పలేదు.. కోహ్లీ, కోచ్‌పై రైనా ఆసక్తికర వ్యాఖ్యలు..!
- IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
కొత్త ఫార్మాట్లు, ఫ్రాంచైజీ లీగ్‌ల కారణంగా టెస్టులు అభిమానుల ఆదరణ కోల్పోతున్నాయని.. టెస్ట్ క్రికెట్ కాకుండా ఆటగాళ్లకు చాలా అవకాశాలున్నాయని.. కానీ క్రికెట్ బతకాలంటే టెస్టులు ఆడటం కూడా ముఖ్యమే అని బెన్ స్టోక్స్ అన్నాడు. ఫలితం కంటే వినోదంపై దృష్టి సారిస్తే టెస్ట్ క్రికెట్‌కు కూడా ఆదరణ పెరుగుతుందని స్పష్టం చేశాడు. టెస్టుల్లో ఫలితం గురించి ఆలోచించడం మానేయాలని.. ప్రతిరోజూ వినోదం అందించడంపైనే దృష్టి పెట్టాలన్నాడు. ఏం జరుగుతుందో అభిమానులకు అర్ధం కాకూడదని.. ఏం చూడబోతున్నామన్న ఉత్సాహం అభిమానుల్లో కనబరిస్తే బంతి పడకముందే గెలిచినట్లు అని స్టోక్స్ పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్ అంటే తనకు ప్రాణమని తెలిపాడు.
తాజావార్తలు
-
Karimnagar Drought: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి.. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి!
-
Rahul Gandhi Hyderabad Visit: హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ?.. భారత్ సమ్మిట్, గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశం!
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
Ravi Shastri Commentary: 1994లో మొదలైన ప్రయాణం.. కామెంటరీలో తన గురువులెవరో వెల్లడించిన రవిశాస్త్రి!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
ట్రెండింగ్
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!