T20 World Cup 2022: భారీ అంచనాల నేపథ్యంలో ఆదివారం నాడు టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. తొలుత క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ మేరకు ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లోనే సంచలనం నమోదైంది. శ్రీలంకపై నమీబియా గెలిచి షాక్ ఇచ్చింది. అక్టోబర్ 22 నుంచి సూపర్-12 రౌండ్ ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నీలో రిజర్వు డేను కూడా ఐసీసీ అమలు చేస్తోంది. ఈ రిజర్వు డేను కేవలం నాకౌట్ మ్యాచ్‌లకు మాత్రమే ఉపయోగించనున్నారు. వర్షం లేదా…
Team India: గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు బుమ్రా స్థానంలో ఎవరినీ బీసీసీఐ ఎంపిక చేయలేదు. అయితే తాజాగా బుమ్రా స్థానంలో షమీని జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గతంలో స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో షమీ ఉండగా ప్రస్తుతం తుది జట్టులోకి అతడిని తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. శుక్రవారము షమీ ఆస్ట్రేలియా చేరుకున్నాడని.. త్వరలో బ్రిస్బేన్‌లో ఉన్న టీమిండియాతో అతడు కలుస్తాడని…
Ravi Shastri: బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి గంగూలీ తప్పుకోనున్న నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అయితే గంగూలీ, రవిశాస్త్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం భారత క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్ ఇంటర్వ్యూకు గంగూలీ ముందు హాజరుకావాలంటే గతంలో రవిశాస్త్రి ఎంతో ఆలోచించాడు. అటు బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ తీసుకున్న పలు నిర్ణయాలను కూడా రవిశాస్త్రి బాహాటంగానే విమర్శించాడు. ఈ నేపథ్యంలో గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ…
National Games: అహ్మదాబాద్‌లో జరిగిన 36వ జాతీయ క్రీడల్లో గుజరాత్‌లోని వడోదరకు చెందిన 10ఏళ్ల బాలుడు శౌర్యజిత్ ఖైరే చరిత్ర సృష్టించాడు. మల్లఖంబ్ క్రీడల్లో కాంస్య పతకం సాధించి జాతీయ క్రీడల్లో పతకం గెలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. మల్లఖంబ్ క్రీడల్లో బాలుడి విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శౌర్యజిత్ విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గుజరాత్ సంప్రదాయ క్రీడ అయిన మల్లఖంబ్‌కు ఇటీవలే జాతీయ క్రీడల్లో…
IND Vs SA: వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఓడిపోయింది. ఢిల్లీ వేదికగా జరిగిన కీలకమైన మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. 100 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 8 పరుగులు చేసి రనౌట్‌గా వెనుతిరగ్గా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 49 పరుగులకు అవుటయ్యాడు. గత…
IND Vs SA: ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో కేవలం 27.1 ఓవర్లలో 99 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌటైంది. టీమిండియా ముందు 100 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తే మూడు వన్డేల సిరీస్ భారత జట్టు సొంతం అవుతుంది. 34 పరుగులు చేసిన క్లాసెన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జానేమన్ మలాన్…
IND Vs SA: ఢిల్లీ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య కీలక మూడో వన్డే జరుగుతోంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా, రెండో వన్డేలో టీమిండియా గెలవడంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. దీంతో ఈ వన్డేలో ఎవరు గెలిస్తే మూడు వన్డేల సిరీస్ వారికే సొంతం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండో వన్డేలో ఆడుతున్న టీమ్‌నే మూడో వన్డేలోనూ…
Ishan Kishan: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఇషాన్ కిషన్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన ఇషాన్ బ్యాటింగ్ అభిమానులను అలరించింది. ఈ క్రమంలో అతడు తన పేరిట కొత్త రికార్డులు నమోదు చేసుకున్నాడు. ఒక వన్డేలో 7 సిక్సులు కొట్టిన రెండో భారత యంగెస్ట్ ప్లేయర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. గతంలో రిషబ్ పంత్ పేరిట ఈ రికార్డు ఉండేది. పంత్ 23 ఏళ్ల 173…
IND Vs SA: రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులు చేసింది. తొలి వన్డేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న రవి బిష్ణోయ్, జిడ్డు బ్యాటింగ్ చేసిన రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కనబెట్టింది. వీరి స్థానంలో ఆల్‌రౌండర్లు షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులోకి తీసుకుంది. ఇప్పటికే తొలివన్డేలో ఓటమి పాలైన టీమిండియా రెండో వన్డేలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ వన్డే…
Asia Cup 2022: పురుషులు విఫలమైన చోట మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. మహిళల ఆసియా కప్‌లో టీమిండియా సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఓటమి నుంచి తేరుకున్న టీమిండియా శనివారం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను 59 పరుగుల తేడాతో చిత్తుచేసింది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించిన భారత్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్ షెఫాలి వర్మ రాణించింది. ఆమె 44 బంతుల్లో 5 ఫోర్లు, 2…