Stump Out: టెస్ట్ మ్యాచ్‌లో అరుదైన సీన్.. 145 ఏళ్ల పురుషుల క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stump Out: ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీ వేదికగా తొలి టెస్టు జరుగుతోంది. అయితే ఈ టెస్టులో అరుదైన సీన్ చోటు చేసుకుంది. దీంతో 145 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎన్నడూ చూడని రికార్డును న్యూజిలాండ్ కీపర్ బ్లండెల్ సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా తొలి రెండు వికెట్లను స్టంపౌట్ రూపంలోనే కోల్పోయింది. అబ్దుల్లా షఫిఖ్ (7), షాన్ మసూద్ (3)ను న్యూజిలాండ్ కీపర్ బ్లండెల్ స్టంపౌంట్ ద్వారా అవుట్ చేశాడు. ఓ టెస్ట్ మ్యాచ్‌లో తొలి రెండు వికెట్లు స్టంపౌట్ కావడం పురుషుల క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.
Read Also: Sergey Lavrov: యుద్ధం ముగించాలంటే.. ఉక్రెయిన్ ఆ షరతుల్ని పూర్తి చేయాలి
Also Read
- IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
- Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీలు!
- Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
అయితే ఓవరాల్‌గా క్రికెట్ చరిత్రలో మాత్రం ఇది రెండోసారి. గతంలో 1976లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా మహిళా జట్టు స్టంపౌట్ల రూపంలో వికెట్లను దక్కించుకుంది. ఇప్పుడు రెండో జట్టుగా న్యూజిలాండ్ పురుషుల క్రికెట్ జట్టు నిలిచింది. కాగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ భారీ సెంచరీతో చెలరేగాడు. అతడు 161 పరుగులు చేయగా మరో యువ క్రికెటర్ అఘా సల్మాన్ కూడా సెంచరీ బాదాడు. దీంతో పాకిస్థాన్ 438 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌధీ 3 వికెట్లు దక్కించుకోగా అజాజ్ పటేల్, మిచెల్ బ్రేస్‌వెల్ తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అటు పాక్ తరఫున దాదాపు 16 ఏళ్ల కిందట మహమ్మద్ యూసఫ్ నెలకొల్పిన రికార్డును బాబర్ ఆజమ్ అధిగమించాడు. ఒకే క్యాలెండర్ ఏడాదిలో (2006) అన్ని ఫార్మాట్లలో కలిపి యూసఫ్ 33 మ్యాచుల్లో 2,435 పరుగులు చేయగా.. దానిని బాబర్ ఆజమ్ బద్దలు కొట్టాడు.
తాజావార్తలు
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!