మహిళలపై నేరాలు చేసేవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో నిందితులకు ఖచ్చితంగా, వేగంగా శిక్ష పడేలా దర్యాప్తు సాగాలని సిఎం ఆదేశించారు. మహిళలపై నేరాలకు పాల్పడితే శిక్ష తప్పదనే భయం నేరగాళ్లలో రావాలని చంద్రబాబు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్ళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు.
సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. మనీలాండరింగ్ కేసును ప్రత్యేక న్యాయస్థానం పరిగణలోకి తీసుకుని సమన్లు జారీ చేసినా కూడా నిందితుడిని అరెస్టు చేయాలంటే.. ప్రత్యేక కోర్టు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ప్రత్యేక కోర్టు ఆదేశించింది. బీజేపీ నేతల నిరసన చిత్రాన్ని మార్ఫింగ్ చేసినందుకు డీకే శివకుమార్‌తో పాటు
అత్యాచారం కేసులో ఏపీకి చెందిన కొందరు పోలీసులకు భారీ ఊరట లభించింది. వారిని నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఒక గ్రామంలో 16 ఏళ్ల క్రితం 11 మంది గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 21 మంది పోలీసులను ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
Vakapalli Case: వాకపల్లి ఆదివాసీ మహిళల అత్యాచారం కేసును కొట్టేసింది విశాఖ సెషన్స్ కోర్టు. విచారణలో నేరం రుజువు కాలేదని తెలిపింది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని లీగల్ సెల్ అథారిటీని ఆదేశించింది. 2007 ఆగస్టులో విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లిలో ఈ ఘటన జరిగింది. కుంబింగ్ కోసం వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం అత్యాచారాలకు పాల్పడిందని కేసు నమోదు చేశారు. మానవాహక్కులు, పౌర సంఘాలు కల్పించుకోవడంతో వివిధ దశల్లో విచారణ జరిగింది. అయితే, కేసు విచారణ…
అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్ల కేసులో 49 మందిని నేరస్థులుగా ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ప్రకటించింది. 2008 జులై 26లో అహ్మదాబాద్ నగరంలో ఒకేసారి 70 నిమిషాల వ్యవధిలో వరుసగా జరిగిన 21 పేలుళ్లలో 56 మంది చనిపోగా, 200 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ కేసులో మరో 28 మంది నిర్దోషులుగా ప్రత్యేక కోర్టు జడ్జి ఎఆర్ పటేల్ విడిచిపెట్టారు. ఈ పేలుళ్లకు సంబంధించి మొత్తం వేర్వేరుగా దాఖలైన 35 కేసులను కలిపి ఒకటిగా విచారించారు. మొత్తం 77…
ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు జడ్జి జస్టిస్ సీహెచ్‌వీఆర్ఆర్ వరప్రసాద్ ను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సీబీఐ స్పెషల్ కోర్టు-1 అదనపు జడ్జిగా వరప్రసాద్ కు బాధ్యతలు అప్పగించింది న్యాయస్థానం… ఇక, ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల కోర్టు న్యాయమూర్తిగా కె.జయకుమార్ ను నియమించింది. జస్టిస్ జయకుమార్ ప్రస్తుతం వరంగల్ ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు.. మరోవైపు.. తెలంగాణ…
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ప్రజా ప్రతినిధుల కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది… 2015లో జరిగిన ఘర్షణ కేసులో తీర్పు వెలువరించిన కోర్టు.. దానం నాగేందర్‌కు వెయ్యి రూపాయాలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.. 2015లో జరిగిన ఘర్షణ కేసులో ఇవాళ హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులోని ఎంపీ మరియు ఎమ్మెల్యేల స్పెషల్ సెషన్ కోర్టులో విచారణ జరిగింది.. యూ/ఎస్ 323,506 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ ప్రకారం బంజారా హిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ పూర్తి…