Ahmedabad Blasts : 49 మంది నేరస్థులు.. శిక్షలు ఖరారు అప్పుడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్ల కేసులో 49 మందిని నేరస్థులుగా ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ప్రకటించింది. 2008 జులై 26లో అహ్మదాబాద్ నగరంలో ఒకేసారి 70 నిమిషాల వ్యవధిలో వరుసగా జరిగిన 21 పేలుళ్లలో 56 మంది చనిపోగా, 200 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ కేసులో మరో 28 మంది నిర్దోషులుగా ప్రత్యేక కోర్టు జడ్జి ఎఆర్ పటేల్ విడిచిపెట్టారు. ఈ పేలుళ్లకు సంబంధించి మొత్తం వేర్వేరుగా దాఖలైన 35 కేసులను కలిపి ఒకటిగా విచారించారు. మొత్తం 77 మంది నిందితులపై విచారణ జరిగింది. నేరస్థులు 49 మందికి శిక్షలు ఖరారు చేయడం బుధవారం నుంచి ప్రారంభమౌతుందని కోర్టు వెల్లడించింది. నిందితులు 77 మందిపై విచారణ గత ఏడాది సెప్టెంబర్ 21నే పూర్తయింది. కానీ తరువాత తీర్పు తేదీలు అనేక మార్లు వాయిదా పడ్డాయి.
విచారణ సందర్భంగా మొత్తం 1163 మంది సాక్షులను విచారించారు. నిర్దోషులుగా విడుదలైన వారిలో మొహమ్మద్ ఇర్ఫాన్ నసీర్ అహ్మద్, షకీల్ అహ్మద్ ఉన్నారు. నిందితులు వివిధ జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మంగళవారం కోర్టుకు హాజరయ్యారు.
తీర్పు కూడా వారు వర్చువల్‌గా హాజరై విన్నారు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) అనే నిషేధిత ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న 78 మందిపై 2009 డిసెంబర్‌లో విచారణ ప్రారంభమైంది. వీరిలో ఒకరు అప్రూవర్‌గా మారడంతో నిందితుల సంఖ్య 77 కు తగ్గింది. తరువాత మరో నలుగురు నిందితులు అరెస్టయినా వారిపై విచారణ ఇంకా ప్రారంభం కాలేదని సీనియర్ ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్లకు ప్రతీకారంగా ఐఎం ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు కుట్ర పన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పేలుళ్లు జరిగిన ప్రదేశాల్లో అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలోని ట్రామా కేర్ సెంటర్ కూడా ఉంది. ఈ సంఘటనలో మైనార్టీ సమాజానికి చెందిన అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వరుస పేలుళ్ల తరువాత సూరత్‌లో అనేక ప్రాంతాల నుంచి పోలీసులు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అహ్మదాబాద్‌లో 20, సూరత్‌లో 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
Also Read
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
తాజావార్తలు
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?