Varun Chakaravarthy: అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ చేసిన వరుణ్ చక్రవర్తి!
- వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డు
- భారత్ తరపున అత్యధిక వికెట్లు
- అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో టీ20లో రెండు వికెట్స్ తీయడంతో వరుణ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ సిరీస్‌లో ఈ మిస్టరీ స్పిన్నర్ ఇప్పటివరకు 10 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.
ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. 2016లో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో యాష్ 9 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డును వరుణ్ బ్రేక్ చేశాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లోని మొదటి టీ20లో మూడు వికెట్స్ తీసిన వరుణ్.. రెండో టీ20లో ఐదు వికెట్స్ పడగొట్టాడు. ఇక మూడో టీ20లో రెండు వికెట్స్ తీయడంతో 10 వికెట్స్ వరుణ్ ఖాతాలో చేరాయి. ఇక చివరి టీ20 నవంబర్ 15న జరగనుంది.
Also Read
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
Also Read: Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. బద్దలైన రైనా రికార్డు !
మూడో టీ20లో వరుణ్ చక్రవర్తి తన కోటా 4 ఓవర్లలో రెండు వికెట్స్ తీసి.. 54 రన్స్ ఇచ్చాడు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (21), కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్ (29)లను సరైన సమయంలో పెవిలియన్‌కు పంపి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. గత రెండు మ్యాచ్‌లతో పోలిస్తే.. వరుణ్ పరుగులు కాస్త ఎక్కువగా ఇచ్చినప్పటికీ రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత్‌కు మరో విజయాన్ని అందించాడు. ఇప్పటివరకు భారత్ తరఫున 12 టీ20లు ఆడిన వరుణ్.. 17 వికెట్స్ పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 5/17. వరుణ్ చక్రవర్తి ఐపీఎల్ ద్వారా భారత జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో 71 మ్యాచులు ఆడిన వరుణ్.. 83 వికెట్స్ తీశాడు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!